మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ మంథని నియోజక వర్గం ఇంచార్జీ పుట్ట మదన్న బహుజన వాదం పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేస్తున్నారని, బహుజన వాదం ముసుగులో అగ్రవర్ణాల పల్లకీ మొస్తున్నడని మహాదేవపూర్ ఎంపీపీ రాణీబాయి రామారావు ఆరోపించారు.బీసీ బిడ్డనైన నాపై అవిశ్వాసం పెట్టీ, అగ్రవర్ణాలకు ఎంపీపీ పదవిని అప్పగించాలని ఎందుకు క్యాంపు రాజకీయాలు చేశారో ప్రజలకు చెప్పాలని ఎంపీపీ డిమాండ్ చేశారు. ఎంపీపీ పదవిని చేపట్టిన రోజు నుండి, నేటి వరకు పార్టీకి వ్యతిరేకంగా పని చేయలేదని, ప్రజలకు సేవలు చేస్తూ, మండల అభివృద్ధి కోసం పాటుపడ్డామని ఎంపీపీ వివరించారు. అధికార పార్టీ లో ఉన్న మేము భూ కబ్జాలు చేయలేదని, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, కలప స్మగ్లర్ల తో కుమ్మక్కు కాలేదని, ఇంత నిజాయితీగా ఉన్న మాపై పుట్ట మధు కక్షగట్టి అవిశ్వాసం పెట్టించి కుట్రపూరిత రాజకీయం ఎందుకు చేశారో వివరించాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ పదవి ఉత్త పుణ్యానికే ఇవ్వలేదని, 80 లక్షల ముడుపులు పుచ్చుకుని ఇచ్చారని ఆరోపించారు. బహుజన వాదం పేరు తో రాజకీయాలు చేస్తున్నా పుట్ట మదన్న, బీసీ సామాజిక వర్గంకు చెందిన రామగిరి ఎంపీపీ దేవక్క తో పాటు, మాపైన, దళితుడైన మంథని ఎంపీపీ శంకర్ పైన కుట్ర చేస్తూ, మానసికంగా కృంగదీస్తున్నారని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానం వీగిపోవాడానికి సహకరించిన కాంగ్రెస్ ఎంపీటీసీ లకు, ఎంపీపీ రాణీబాయి రామారావు కృతజ్ఞతలు తెలిపారు. అధికార పార్టీనీ వీడి మరో పార్టీలో చేరే ఆలోచన లేదని, ప్రజలు, మిత్రులు, స్నేహితులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని ఎంపీపీ స్పష్టం చేశారు. మరో ఏడాది పాటు మండల అభివృద్ధి కోసం పాటు పడతామని ప్రకటించారు. పుట్ట మధు మాయమాటలకు బహుజనులు మోసపోవద్దని నియోజక వర్గం ప్రజలకు ఎంపీపీ రాణీబాయి రామారావు విజ్ఞప్తి చేశారు...
Home
Unlabelled
నాపై అవిశ్వాసం ఎందుకు పెట్టించారో పుట్ట మధు ప్రజలకు చెప్పాలి ఎంపీపీ రాణీబాయి రామారావు...
Post A Comment: