చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
సీనియర్ డిసిబిలిటి వెల్ఫేర్ సొసైటీ యాదాద్రి జిల్లా ఆధ్వర్యంలో కత్తుల బాలకృష్ణ అధ్యక్షతన వాయిస్ ఆఫ్ స్పెషాలి ఏబుల్ పీపుల్స్ సహకారంతో పదిమంది దివ్యాంగులకు ముఖ్య అతిథి గా విచ్చేసిన ఎస్ దేవేందర్. చౌటుప్పల్ సిఐ చేతుల మీదగా దివ్యాంగులకు వాకర్స్, సంక కర్రలు, చేతి కర్రలు, ప్రతిభ ఒకేషనల్ కాలేజ్ గాంధీ పార్క్ చౌటుప్పల్ లో పంపిణీ చేశారు. సొసైటీ అధ్యక్షుడు బాలకృష్ణ కత్తులు మాట్లాడుతూ, వికలాంగుల సమస్యలు సిఐ కి వివరించారు. అలాగే వికలాంగులను తిట్టినా, వివక్షత చూపినా, అవిటితనంతో ఎత్తి చూపినా, కఠిన చర్యలు తీసుకోవాలని సెక్షన్ 92 ప్రతిష్టం చేయాలని, వికలాంగులకు న్యాయం చేయాలని కోరారు. సిఐ మాట్లాడుతూ... ఇంత మంచి కార్యక్రమానికి పిలిచినందుకు దాతలకు, వికలాంగుల సోదరులకు, ధన్యవాదాలు తెలుపుతూ తన వంతు సహాయం కండరాల క్షీణత, బాధితుల కోసం నిత్యవసర సరుకులు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల కౌన్సిలర్ తాండూరు పరమేష్, చిలువేరు శ్రీనివాస్, శేఖర్ రెడ్డి, శివకుమార్, రఘు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: