ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ

నాన్ లేఅవుట్ వెంచర్లు చేసేవారిపై కఠిన తప్పవని కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. వరంగల్ జిల్లా ఐనవోలు మండలం పంథిని, పున్నెలు గ్రామాల పరిధిలో అక్రమ వెంచర్ల ఏర్పాటు విషయం చైర్మన్ దృష్టికి రాగా ఆయన బుధవారం రోజున కుడా అధికారులను ఆదేశించారు. పంథిని గ్రామంలోని సర్వే నంబర్ 26 లో లోకేష్, సాగర్ రెడ్డి అనే వ్యక్తులు దాదాపు 6 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్ లో ఏర్పాటు చేసిన హద్దు రాళ్లను కుడా సిబ్బంది తొలగించారు. ప్రహారీ కూల్చివేశారు. సదరు వ్యక్తులకు నోటీసులను సైతం అందజేశారు. అలాగే పున్నెలు సర్వే నంబర్ 81 లో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన వెంచర్‌తో పాటు అదే గ్రామ పరిధిలోని 583 సర్వే నంబర్ 20 గుంటలు విస్తీర్ణంలో ఉన్న మరో నాన్ లేఅవుట్ వెంచర్ కుడా అధికారులు చర్యలు చేపట్టారు. భూ యజమానులకు నోటీసులు అందజేశారు. ఎవరు నాన్ లేఅవుట్ వెంచర్లు చేసిన ఉపేక్షించబోమని, కఠిన చర్యలు చేపడతామని కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ ఏర్పాటు చేసిన కుడా అధికారులకు సమాచారం అందించాలని కోరారు. అంతే కాకుండా నాన్ లేఅవుట్ ప్లాట్లను కొనుగోలు చేసి వినియోగదారులు ఇబ్బందులు పడద్దని సలహా ఇచ్చారు. గృహ నిర్మాణ అనుమతులు, మౌలిక వసతుల లేమీతో ఇబ్బందిపడుతున్నారని వివరించారు. భూ యజమానులు ఎవరైనా వెంచర్ ఏర్పాటు చేయదలిస్తే కుడా ఆధ్వర్యంలో పబ్లిక్ - ప్రైవేట్ పార్టనర్‌షిప్ పద్ధతిలో వెంచర్లను ఏర్పాటు చేస్తున్నామని ,ఇటీవలే ఉనికిచర్లలో సైతం కుడా లేఅవుట్ వేంచర్ ఏర్పాటు చేసి అమ్మకాలు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. కావున వినియోగదారులెవరూ నాన్ లేఅవుట్ వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేయరాదని విజ్ఞప్తి చేశారు.
Post A Comment: