ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
తెలంగాణలో కవులకు, కళాకారులకు ప్రముఖ స్థానం ఉందని, మరీ ముఖ్యంగా ఓరుగల్లు కళలకు కేంద్రమని ప్రభుత్వ చీఫ్ విప్ , పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్, కలెక్టర్, కమిషనర్ తో కలిసి జైన్ టెంపుల్, సరిగమ పార్కును చీఫ్ విప్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులది కీలక భూమిక అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి కవులపై , కళాకారులపై అమితమైన గౌరవం అని, అందుకే కవులకు, కళాకారులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. కళాకారుల కోసం ముఖ్యమంత్రి గారు నియోజకవర్గ పరిధిలో రూ.75 కోట్ల తో కాళోజీ కళాక్షేత్రం ఇప్పటికే నిర్మించడం జరుగుతోందని తెలిపారు. నగర ప్రజలకు ఉల్లాసాన్ని కల్పించేందుకు ఇప్పిటికే భద్రకాళీ బండ్, పబ్లిక్ గార్డెన్, డివిజన్లలో పార్కుల ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో నగర వాసులకు ఉల్లాసాన్ని కల్పించేందుకు సరిగమ పార్కును సైతం అందుబాటులోకి తెస్తామని అన్నారు. సరిగమ పార్కును కుడా, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మౌలిక వసతులు కల్పించి, కళాకారులకే నిర్వహణ బాధ్యతలను కళా సంఘాలకు త్వరలో అప్పగిస్తామని తెలిపారు. నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్, కమిషనర్, కార్పొరేటర్లు అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: