ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;నగరం ముంపు బారినపడకుండా చర్యలు చేపడతామని ప్రభుత్వ చీఫ్ విప్ , పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. గ్రేటర్‌లోని 31వ డివిజన్ న్యూ శాయంపేటలో ఆయన కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ , కలెక్టర్ సిక్తా పట్నాయక్, కమిషన్ షేక్ రిజ్వాన్ బాషా, స్థానిక కార్పొరేటర్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ మాట్లాడుతూ ఇటీవల భారీ వర్షాలకు నగరం ముంపు బారినపడిన నేపథ్యంలో ప్రభుత్వం నిబద్ధతతో ఉందని అన్నారు. నాలాలపై ఆక్రమణలను తొలగిస్తున్నామని, నాలాలు ఆక్రమణలు జరగకుండా జీడబ్యూఎంసీ ఆధ్వర్యంలో చేపడతామని స్పష్టం చేశారు. న్యూశాయంపేట పరిధిలో కాలనీలు ఇటీవల నీట మునగగా ఆయా ప్రాంతాల్లో పర్యటించి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాలాలపై నిర్మాణాలను తొలిగించాలని సూచించారు. మొసళ్లు, కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. అనంతరం భద్రకాళీ చెరువులోకి వెళ్తున్న న్యూ శాయంపేట నాలా పరిసరాలను పరిశీలించారు. నాలాల పూడికతీత, విస్తరణ పనులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Post A Comment: