ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని అనేక కాలనీలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రతి శుక్రవారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం చేయడం జరుగుతుంది. అధికారులతోని ఎప్పటికప్పుడు చర్చలు జరిపి పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు కేటీ రామారావు సహకారంతో ఎప్పటికప్పుడు నగరాభివృద్ధికి కావలసిన నిధులను తీసుకువచ్చి నగర అభివృద్ధి కోసం పాటుపడడం జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అందులో భాగంగా ఈ శుక్రవారం 67 డివిజన్లో స్థానిక కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ ఆధ్వర్యంలో కాలనీ పెద్దలు అందరితో కలిసి పలు సమస్యల పైన చర్చించి, 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రోడ్డు వెడల్పు, డ్రైనేజీ సమస్యను వడ్డేపల్లి పరిసర ప్రాంతాలు ఉంటాయి కాబట్టి, కొంత గ్రామీణ వాతావరణం ఉంటుంది కాబట్టి నగరం అభివృద్ధి చెందుతున్న తరుణంలో పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో కొత్త కాలనీలతో పాటు కొత్త సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి అన్ని రకాల సమస్యలను పరిష్కరించే దిశగా నియోజకవర్గంలో కొన్ని వేలకోట్లతో ఇప్పటికే అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. 60 డివిజన్లో రోడ్డు వెడల్పు కార్యక్రమం, డ్రైనేజీ సమస్య ఇతర సమస్యల పరిష్కారం కోసము మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ భాషా మరియు సిపి తో పర్యసించడం జరిగిందని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని అన్నారు. సంక్షేమ పథకాలు పొందినటువంటి వారు పలువురికి చెప్పి రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో భాగస్వామ్యం కావాలని అన్నారు. పదేళ్ల కాలంలో ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేయనటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరొక్కసారి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్,డివిజన్ అధ్యక్షులు రామరాజు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: