ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
రాబోయే ఎన్నికల్లో సెక్టోరల్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ లో సీపీ రంగనాధ్ తో కలిసి కలెక్టర్ సెక్టోరల్, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి 42మంది సెక్టోరల్ అధికారులను నియమించామని, తెలిపారు ఎన్నికల నిర్వహణ లో సెక్టర్ అధికారుల విధులు చాలా ప్రాముఖ్యతతో ఉంటాయని, ఇప్పటి వరకు అనేక ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఎలాంటి అలసత్వం, నిర్లక్ష్యం లేకుండా, ఎప్పటికప్పుడు ఎన్నికల కమీషన్ నుండి వచ్చే మార్గదర్శకాలను పాటిస్తూ రాబోయే ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు సమాయత్తం కావాలని కలెక్టర్ అన్నారు. పోలింగ్ నిర్వహణకు ముందు సెక్టార్ అధికారులు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాల రూట్ మ్యాప్ పరిశీలించాలని, పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పన పరిశీలించాలని, నూతన పోలింగ్ కేంద్రాలపై విస్తృత ప్రచారం కల్పించాలని, ఎంసిసి నిబంధన ఉల్లంఘన పై నిఘా ఉంచాలని, తెలిపారు. పోలింగ్ కు ముందు నిర్వహించే ఓటరు సవరణ షెడ్యూల్ పై ప్రస్తుత ప్రచారం నిర్వహించాలని, అధికారి వద్ద ఉన్న ఓటర్ జాబితాలో పేర్లు చూసుకునే విధంగా ఓటర్లకు సమాచారం అందించాలని, ఈవిఎం వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలని, తెలిపారు.
సీపీ రంగనాథ్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ప్రకారం నిబంధనలు పాటిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలు ప్రకారం ఎటువంటి పొరపాట్లు రాకుండా చూసుకోవాలని, ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశంపై అధికారులు సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలనీ, ఒకటికి రెండు సార్లు విషయాలు తెలుసుకొని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ మహేందర్ ఆర్డీఓ లు రమేష్ కుమార్, శ్రీనివాస్ ఇండస్ట్రీస్ జిఎం హరిప్రసాద్ పోలీస్, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Post A Comment: