ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;2023 (టీచర్ ఎల్జిబిలిటి టెస్ట్) పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిక్త పట్నాయక్ అధికారులను ఆదేశించారు.
శనివారం మినీ కాన్ఫరెన్స్ హల్ లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైన ఈ నెల 15 న టెట్ పరీక్ష కొనసాగనున్న నేపథ్యంలో కలెక్టర్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఉదయం 9:30 గంటల నుండి 12:00 గంటల వరకు మొదటి సెషన్ లో జరిగే పేపర్-1, అలాగే రెండవ సెషన్ లో మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహిస్తున్నాం అని అన్నారు.
42 పరీక్ష సెంటర్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు
గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు పరీక్షల సమయాలకు అనుగుణంగా రవాణా సదుపాయం అందుబాటులో ఉండేలా బస్సులు నడిపించాలని ఆర్టీసీ ఆర్ఎం కు సూచించారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ట్రాన్స్ కో అధికారులను ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పరీక్ష సజావుగా జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్ష జరిగేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. టెట్ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో డిఆర్ఓ గణేష్, డిఈఓ అబ్దుల్ హై, డిఎంఅండ్ హెచ్ ఓ సాంబశివ రావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: