వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఓటరు నమోదు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ కోరారు.
శనివారం నాడు కలెక్టర్ కిట్స్ కాలేజీ ఆడిటోరియం లో ప్రత్యేక శిబిరాల నిర్వహణ తీరుతెన్నులను, ఓటరు జాబితాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో కలెక్టర్ మాట్లాడుతూ మన ఓటు హక్కు విలువను గుర్తుంచుకోవాలని, మనం ఇష్టపడిన నాయకున్ని ఎన్నుకునే వెసులుబాటును భారత రాజ్యాంగం కల్పించిందని, ప్రతి పౌరుడు ఎన్నికలలో పోలింగ్ బూతుకు వెళ్లి తమ ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. జిల్లాలో ఈ నెల సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రత్యేక శిబిరాల రోజులలో జిల్లా లోని అన్ని పోలింగ్ కేంద్రాలలో బూత్ స్థాయి అధికారులు ఓటరు జాబితాతో అందుబాటులో ఉంటారని తెలిపారు. కొత్తగా ఓటరు నమోదుకు ఫారం- 6, సవరణలు, మార్పులు, చేర్పులకు ఫారం 8, తొలగింపుకు ఫారం 7 ను వినియోగించుకోవాలని తెలిపారు. ఆయా ఫారాలు అన్ని పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రత్యేక ఓటరు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నదీ లేనిది, ఏవేని తప్పులు ఉన్నాయా అన్నది చెక్ చేసుకోవాలన్నారు. ఓటు వజ్రాయుధం లాంటిదని, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే కీలకమని గుర్తించాలన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమం లో ట్రైనీ కలెక్టర్ శ్రద్ద శుక్ల, జిఎం ఇండస్ట్రీ హరిప్రసాద్, కిట్స్ కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతరం కలెక్టర్ కాజీపేట లోగల జూబ్లీ మార్కెట్ హై స్కూల్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక కార్యక్రమం పరిశీలించారు.
Post A Comment: