ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ ;

కాళోజీ క‌ళాక్షేత్రాన్ని ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంద‌ని, ప‌నులు స‌కాలంలో నాణ్య‌త‌తో పూర్తి చేయాల‌ని కుడా చైర్మ‌న్ సంగంరెడ్డి సుంద‌ర్ రాజ్ యాద‌వ్ అన్నారు.  కాళోజీ ప‌నుల‌ను శుక్ర‌వారం సాయంత్రం ఆయ‌న క‌లెక్ట‌ర్ సిక్తా ప‌ట్నాయ‌క్‌, కుడా వైస్ చైర్మ‌న్‌, మున్సిప‌ల్‌ క‌మిష‌న‌ర్ షేక్ రిజ్వాన్ బాషాతో క‌లిసి ప‌ర్య‌వేక్షించారు. ఈ సంద‌ర్భంగా కాళోజీ కళాక్షేత్రం ప‌నుల్లో వేగం పెంచాల‌ని కుడా అధికారుల‌కు, కాంట్రాక్ట‌ర్ల‌కు సూచించారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా నిర్మాణ ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని ఆదేశించారు. కాళోజీ క‌ళాక్షేత్రం నిర్మాణంలో కేసీఆర్‌, కాళోజీ మిత్ర‌మండ‌లి వారి స‌ల‌హాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని సూచించారు. ఆడిటోరియం, ఎంట్రెన్స్, సౌండ్ సిస్టం, సీటింగ్ పనుల్లో ప్రత్యేక  శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పనులను విభజించుకొని, సకాలంలో పూర్తి చేయాల‌ని అన్నారు. కార్యక్రమంలో సిపిఓ అజిత్ రెడ్డి, ఈ ఈ భీమ్రావ్, కాళోజీ ఫౌండేషన్ స‌భ్యులు ఎన్నార్  విద్యార్థి శ్రీ‌నివాస్ రావు, , కుడా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: