మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
వరంగల్ జిల్లా:ఆగస్టు 02
జిల్లాలోని వరద బాధిత ప్రాంతాలను బుధవారం రాష్ట్ర గవర్నర్ తమిళి సై సందర్శించారు. ఈ సందర్భంగా వరదలతో సర్వం కోల్పోయి రోడ్డునపడ్డ బాధితులతో మాట్లాడారు. అనంతరం ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు పంపణీ చేశారు. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భారీ వరదల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకుందని తెలిపారు.
వరంగల్ పట్టణానికి నలువైపులా ఉన్న చెరువులకు వరద పోటెత్తిన కారణంగా ఈ పరిస్థితి చోటు చేసుకుందని అభిప్రాయపడ్డారు.
భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందని తెలిపారు. స్థానిక ప్రజలు చాలా ఏళ్లుగా జవహర్ నగర్ కాలనీ బ్రిడ్జిని పున:నిర్మించాలని కోరుతున్నా స్థానిక ప్రజా ప్రతినిధులు దృష్టి పెట్టలేదని అన్నారు. ముంపు ప్రాంతాల్లో పరిశీలించి, ప్రజల పరిస్థితిని చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ కోరారు...
Post A Comment: