ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 42వ డివిజన్ రంగశాయిపేటను అభివృద్ధిలో ముందు ఉంచుతామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
నేడు రంగశాయిపేటలో 2కోట్ల95లక్షలతో నిధులతో సిసి రోడ్లు, డ్రైనేజీ మరియు ఇతర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శంకుస్థాపన చేసారు.
ఈ సందర్భంగా రంగశాయిపేట కవిచర్ల క్రాస్ వద్దనున్న ఎల్లమ్మ దేవాలయాన్ని దర్శించుకొని గీత కార్మికులు సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు.
నేడు 2కోట్ల 95లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని అందులో భాగంగా మున్నూరు కాపు,గంగపుత్ర, చౌదరి,గౌడ,యాదవ మరియు ఇతర కులస్తులకు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు.
నాడు రంగశాయిపేట ప్రజలకు తాను మాట ఇచ్చానని ఎన్నికలు ఏవైనా పలితాలేమైన రంగశాయిపేట దత్తత తీసుకొని గొప్పగా అభివృద్ది చేస్తానని చెప్పానని నేడు ఆ దిశగా సాగుతున్నామని ఎమ్మెల్యే అన్నారు.
నేడు శంకుస్థాపన చేసిన 3కోట్లు కాకుండా అదనంగా 4కోట్ల రూపాయలు కేటాయించమని అతి త్వరలో కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే అన్నారు.
మునుముందు రంగశాయిపేటను మరింత గొప్పగా అభివృద్ధి చేస్తామని అతి సమీపంలోనే 313 కోట్లతో రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని రంగశాయిపేటను అభినవ అభివృద్ధి పేటగా మారుస్తానని ఎమ్మెల్యే అన్నారు.
డివిజన్ ప్రజలందరు అన్ని రకాలుగా బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉండాలని తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గుండు చందన,మాజీ కార్పొరేటర్ కేడల పద్మ, పిఏసిఎస్ చేర్మెన్ కేడల జనార్దన్,
డివిజన్ అధ్యక్షులు కర్ర కుమార్ ముఖ్య నాయకులు హాజరయ్యారు.
Post A Comment: