మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని బోడగట్ గ్రామస్తులు దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపిడిఓ భారతికి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం దళిత బంధు పథకం అమలు చేస్తుండగా బోడగట్ గ్రామంలో 40 దళిత కుటుంబాలు ఉన్నాయని కేవలం రెండు మాత్రమే కేటాయించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. 40 కుటుంబాలకు దళిత బంధు అమలు చేయాలని వారు స్థానిక అధికారులకు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు ఈకార్యక్రమంలో బొడగట్ దళిత కుటుంబ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: