ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ ;

కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, నాణ్యత పాటించాలని  ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కాళోజి కళాక్షేత్రం నిర్మాణ పనులపై ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ   డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్   యాదవ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, షేక్ రిజ్వాన్ బాషా తో కలిసి కాళోజి కళాక్షేత్రం పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్  మాట్లాడుతూ కాళోజి కళాక్షేత్ర నిర్మాణ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కాళోజి ప్రాముఖ్యత, విశిష్టత చరిత్ర తెలిపేలా నిర్మాణ పనుల్లో ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. కళాక్షేత్రo నిర్మాణంలో సైతం  శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఆడిటోరియం నిర్మాణంలో సాంస్కృతిక మండలి వారు సూచించే సలహాలను  పాటించాలని తెలిపారు.  కాళోజి కళాక్షేత్రంలో  కాళోజీ ఫౌండేషన్,  కవి సమ్మేళనాలా నిర్వహణకు ప్రత్యేక  సదుపాయం కల్పించాలని సూచించారు. కాళోజి విగ్రహం, చిత్ర మాలికలకు ప్రత్యేక స్థానాలను కేటాయించాలని సూచించారు.

కాళోజి ఆర్ట్ గ్యాలరీ పై ప్రత్యేక శ్రద్ద వహించాలి అని అన్నారు.కాళోజి కళాక్షేత్రం నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. ఆడిటోరియం, ఎంట్రెన్స్, సౌండ్ సిస్టం, సీటింగ్ పనుల్లో ప్రత్యేక  శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.  పనులను సకాలంలో పూర్తి చేయాలని,  కాళోజి కళాక్షేత్ర నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ గతంలో సూచించిన సూచనలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో 

 కూడా సీపీఓ అజిత్ రెడ్డి, డీఈఈ రఘునందన్ రావు, ఏఈ లు, తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: