కాటారం, అక్టోబర్ 6 మేడిగడ్డ టీవీ న్యూస్ : వికసిత్ భారత్ నిర్మాణంలో అంగన్‌వాడీ కేంద్రాల పాత్ర ఎంతో కీలకమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్ల నారాయణ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా మంగళవారం కాటారం మండలంలో అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు..బీజేపీ కాటారం మండల అధ్యక్షుడు పాగే రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో మధులపల్లి, గర్రెపల్లి, ఎర్రగుంటపల్లి గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను చల్ల నారాయణ రెడ్డి శాలువాలతో సన్మానించారు. అనంతరం చల్ల నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్యం, అభివృద్ధికి అంగన్‌వాడీ సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. దేశ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. అంగన్‌వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలు వికసిత్ భారత్ నిర్మాణానికి దోహదపడుతున్నాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి అంగన్‌వాడీ సిబ్బంది ఆశీర్వాదాలు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పాగే రంజిత్ కుమార్, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎండీ రఫీ, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం తిరుపతి, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి డోలి అర్జయ్య, మాజీ మండల అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి, బండం మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గోగుల రాజేష్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు కేతిరి రాజయ్య, రాజ్ నాయక్, నవీన్ నాయక్, ఆజ్మీరా రవి, ఎస్కే వస్తాద్, దుర్గం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: