మేడిపల్లి: మేడిపల్లి ఆశ్రమ పాఠశాల కాంపౌండ్‌వాల్, మరుగుదొడ్ల నిర్మాణ పనులపై గ్రామసభలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో నాన్‌లోకల్ వారికి పనులు అప్పగించాలన్న గత తీర్మానాన్ని రద్దు చేశారు. గ్రామపంచాయతీకి చెందిన గాదె రామకృష్ణకు పనులు అప్పగించేందుకు సర్పంచ్, ఉపసర్పంచ్, ఏడుగురు వార్డు సభ్యుల ఆమోదంతో సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. రేపటి నుంచే కాంపౌండ్‌వాల్ నిర్మాణ పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని సర్పంచ్ కోరారు. తనపై నమ్మకంతో పనులు అప్పగించిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.

Post A Comment: