మహాముత్తారం, ఆగస్టు 18: గ్రామపంచాయతీ నిధులను వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించారని ఆరోపిస్తూ బీజేపీ మండల ఉపాధ్యక్షుడు లింగమల్ల సడవలిరావు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మార్క బాపు సొంత భూమికి ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్డు నిర్మించారని ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడని ప్రాంతంలో, ఇరువైపులా చెట్లు మాత్రమే ఉన్న చోట సీసీ రోడ్డు నిర్మించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు అత్యవసరంగా అవసరమైన ప్రాంతాల్లో రోడ్లు నిర్మించాల్సి ఉండగా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రోడ్లు వేయడం సరికాదన్నారు. గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించిన తీర్మానాలపై సంతకాలు చేయవద్దని, సంబంధిత బిల్లులను చెల్లించవద్దని సడవలిరావు కోరారు. ఇప్పటికే నిర్మించిన సీసీ రోడ్డుపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి నిధుల దుర్వినియోగం జరిగిందా లేదా పరిశీలించాలని డిమాండ్ చేశారు. ప్రజాధనం ప్రజల అవసరాలకే వినియోగించాలని ఆయన కోరారు.

Post A Comment: