మహాదేవపూర్: మహాదేవపూర్ మండలంలో స్థానిక పోలీసు అధికారులు ప్రజల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో సైబర్ భద్రత, గంజాయి మత్తు పదార్థాల దుష్పరిణామాలు, రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, యువత గంజాయికి దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల వినియోగం వల్ల వారి భవిష్యత్తు దెబ్బతింటుందని వివరించారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్‌లు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దని సూచించారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులు, సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ వినియోగించాలని సూచించారు..ఈ అవగాహన కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుడాల అరుణ శ్రీనివాస్ పాల్గొని, ప్రజలు పోలీసు శాఖ సూచనలను పాటిస్తూ సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్థానిక ప్రజలు, యువత, వివిధ వర్గాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: