కాటారం, జూలై 3: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) కాటారంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చల్ల సునీత తెలిపారు. ప్రస్తుతం 7వ తరగతిలో 12 సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరం MPCలో 17 సీట్లు, BiPCలో 10 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అడ్మిషన్ పొందాలనుకునే అర్హులైన విద్యార్థినీలు సోమవారం ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు అవసరమైన సంబంధిత విద్యార్హతల సర్టిఫికెట్లతో కేజీబీవీ కాటారం పాఠశాలలో నేరుగా హాజరై స్పాట్ అడ్మిషన్ పొందాలని ఆమె సూచించారు. మరిన్ని వివరాల కోసం కేజీబీవీ కాటారం ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలని కోరారు.


Post A Comment: