చిదినేపల్లి, జూలై 3: వర్షాకాలంలో దోమల వ్యాప్తిని నివారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో చిదినేపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం "డ్రైడే–ఫ్రైడే" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బాలనే జగదీశ్వర్ రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీనివాస్ కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇళ్ల వద్ద ఉన్న కుండలు, డ్రమ్ములు, వాటర్ బాటిళ్లు, కొబ్బరి బొండాలు, పాత టైర్లు తదితర వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఇళ్ల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ కాకుండా చూసుకోవాలని కోరారు. వర్షాకాలంలో దోమల పెరుగుదలను అరికట్టేందుకు అవసరమైన చోట ఆయిల్ బాల్స్ వేయాలని ప్రజలకు సూచించారు. దోమల నివారణకు ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తూ గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచడంలో సహకరించాలని గ్రామపంచాయతీ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కోరల్ల రాజయ్య, ఆశా వర్కర్, గ్రామపంచాయతీ కార్యదర్శి దేవేందర్, గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Home
Chidnepally (చిదినేపల్లి )
చిదినేపల్లిలో డ్రైడే–ఫ్రైడే కార్యక్రమం.. దోమల నివారణపై ఇంటింటి అవగాహన

Post A Comment: