పలిమెల, జూన్ 7: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం ముకునూరు గ్రామానికి చెందిన దుగ్గిరాల రంగారావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం ముకునూరు గ్రామానికి చెందిన ఎర్రవెల్లి వసంతరావు తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే తిప్పనపల్లి ముత్తయ్యను సైతం పరామర్శించి మెరుగైన వైద్య చికిత్స పొందాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావడం తన బాధ్యత అని ఈ సందర్భంగా దుద్దిళ్ల శ్రీను బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Home
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు


Post A Comment: