చిదినేపల్లి, జూన్ 23: చిదినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బొప్పారం గ్రామంలో నిన్న కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల వర్షపు నీరు నిల్వ కావడంతో గ్రామపంచాయతీ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. గ్రామంలో నీరు నిలిచిన ప్రాంతాల్లో మోటార్ సమీపంలోని పైపులను తొలగించి, సైడ్ డ్రైనేజీ కాలువలను పూర్తిగా శుభ్రం చేసి నీటి ప్రవాహాన్ని సక్రమంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ కోరల్ల రాజయ్య, పంచాయతీ కార్యదర్శి దేవేందర్, వార్డు సభ్యుడు మంతెన రాజశేఖర్తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామ ప్రజలు తమ ఇళ్ల చుట్టుపక్కల పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే దోమల వ్యాప్తి, సీజనల్ వ్యాధులను నివారించేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా గ్రామంలో సెంట్రల్ లైట్లు పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించి, చిదినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని సెంట్రల్ లైట్లను ఈరోజు మరమ్మతులు చేసి తిరిగి వెలిగేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో గ్రామపంచాయతీ ముందంజలో ఉండటం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.


Post A Comment: