కాటారం మండల కేంద్రంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 53 కిలోల భారీ కేక్‌ను కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, యువజన నాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. దివంగత నేత, మాజీ స్పీకర్ శ్రీపాద రావు స్ఫూర్తిని కొనసాగిస్తూ, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు అండగా నిలుస్తూ ప్రజాసేవలో నిరంతరం కృషి చేస్తున్న శ్రీను బాబు సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని తెలిపారు. యువతకు మార్గదర్శిగా నిలుస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తున్న శ్రీను బాబు ఆయురారోగ్యాలతో మరిన్ని ఉన్నత స్థానాలు అలంకరించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post A Comment: