July 2025
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

సంగారెడ్డి:- తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, ఇస్నాపూరు, 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరానికి పరిమిత ఖాళీలను భర్తీ చేయుటకు MPC, BiPC గ్రూపుల లో స్పాట్ కౌన్సిలింగ్ 31-07-2025 (గురువారం) నాడు ఇస్నాపూరు కళాశాలలో నిర్వహిస్తున్నామని ప్రధాన ఉపాధ్యాయురాలు జయలక్ష్మి ప్రకటించారు.

ఎంపిక ప్రమాణాలు:

విద్యార్థి మార్చి-2025లో SSC/CBSE/ICSE నుండి (తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమం) ఒకేసారి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలిపారు

మార్కులు సమానంగా ఉన్న సందర్భంలో:MPC గ్రూప్: గణితం (Mathematics) & సైన్స్ (Science) సబ్జెక్టుల మార్కులు ఆధారంగా 

BiPC గ్రూప్: సైన్స్ & గణితం మార్కులు ఆధారంగా ఎంపిక. చేయబడును అని తెలిపారు

 జాతి, ఆదాయ, జనన ధ్రువీకరణ పత్రాలు (Mee Seva నుండి జారీ అయినవి – 2024) తప్పనిసరిగా సమర్పించాలి.

 ఆదాయ పరిమితి:

పట్టణ ప్రాంతం: ₹2,00,000 లోపు

గ్రామీణ ప్రాంతం: ₹1,50,000 లోపు తప్పనిసరిగా తీసుకురావాలి అని తెలియజేశారు

అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు

మూడు జిరాక్స్ సెట్‌లు

మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

రిజిస్ట్రేషన్ సమయం: ఉదయం 9:00 నుండి 1:00 గంటల లోపు మాత్రమే రావాలని తెలిపారు (తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు కావున అందరూ 10 గంటలలోపు సమర్పించాలని తెలిపారు

 మధ్యాహ్నం 2:00 గంటల నుండి డిలీట్ చేయబడును

ఎంపిక విధానం: మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా సంబంధిత కళాశాలలో ఖాళీల భర్తీ

ఖాళీల వివరాలు:

M.P.C - SC-9, BC-3, OC-2, మైనారిటీ-1 మొత్తం:15

Bi.P.C - BC-2, OC-2, మైనారిటీ-1 

మొత్తం:5 ఉన్నాయని తెలిపారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం, అంబటిపల్లి గ్రామంలో  అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. సూరారంలోని ఎస్.ఎస్.వి. స్కూల్‌కు చెందిన బస్సు ఢీకొని మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సింగనేని మల్లేష్, భాగ్య దంపతుల కూతురైన ఈ చిన్నారి ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కింద పడింది.

ఈ ఘటనలో పాప మెదడు బయటికి వచ్చి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ దుర్ఘటనతో అంబటిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

హైదరాబాద్‌: బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి తిరిగి చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాను బహుళ ఆలోచనల తర్వాతే బీజేపీకి రాజీనామా చేశానని, ఇప్పుడు మళ్లీ పార్టీ చేరేందుకు ఆసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కలుసుకొని, రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై వివరించాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు చెప్పారు. ముఖ్యంగా, రాష్ట్ర నాయకత్వం లక్షలాది పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు బీజేపీలో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఈ పరిస్థితులు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని హెచ్చరించారు. రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు బీజేపీలో ఉన్న అంతర్గత విభేదాలు, రాష్ట్ర నేతల తీరుపై ఉన్న అసంతృప్తిని స్పష్టంగా బయటపెడుతున్నాయి. ఆయన వంటి కీలక నాయకుడు పార్టీకి దూరంగా ఉండటం, బహిరంగ విమర్శలు చేయడం బీజేపీకి తెలంగాణ రాజకీయాల్లో ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం గ్రామానికి చెందిన జ్యోత్స్న అనే విద్యార్థిని ఇటీవల MBBS సీటు సాధించిన సందర్భంగా, ఆమె ఉన్నత విద్యకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన జ్యోత్స్నకు రెండు లక్షల రూపాయల చెక్కును అందజేశారు.

జ్యోత్స్న సాధించిన ఈ విజయాన్ని అభినందించిన కేటీఆర్, భవిష్యత్తులో మరింత కష్టపడి చదువుకుని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని, సమాజానికి ఉపయోగపడే సేవ చేయగలరని ఆయన జ్యోత్స్నను ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ మరియు మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని కూడా పాల్గొన్నారు. పుట్టా మధుకర్ ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకురాగా, ఆయన తక్షణమే స్పందించి జ్యోత్స్నకు సహాయం అందించారు.

ఈ సంఘటన కేటీఆర్ నిరుపేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు అందిస్తున్న మద్దతును తెలియజేస్తుంది. ఇలాంటి సహాయం విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి ఎంతో తోడ్పడుతుంది. జ్యోత్స్న లాంటి విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్న వారికి ఇది ఒక ప్రోత్సాహంగా నిలుస్తుంది.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ములుగు జిల్లా, వెంకటాపురం మండలం, మహితపురం గ్రామం సమీపంలోని జలపాతాలను సందర్శించడానికి వెళ్లిన వరంగల్ NITకి చెందిన ఏడుగురు విద్యార్థులు శనివారం రాత్రి దారితప్పి అటవీ ప్రాంతంలో చిక్కుకుపోయారు. సకాలంలో పోలీసులు, అటవీశాఖ అధికారులు స్పందించడంతో విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.

సంఘటన వివరాలు:

వరంగల్ NITకి చెందిన ఈ ఏడుగురు విద్యార్థులు మహితపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న జలపాతాలను చూసేందుకు వెళ్లారు. అయితే, చీకటి పడటంతో వారికి తిరిగి వెళ్లే దారి దొరకలేదు. దట్టమైన అటవీ ప్రాంతంలో దారి తెలియక ఆందోళనకు గురైన విద్యార్థులు వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులను సంప్రదించారు.

సహాయక చర్యలు:

సమాచారం అందుకున్న వెంటనే ములుగు పోలీసులు అటవీశాఖ అధికారులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. విద్యార్థులు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి, వారిని సురక్షితంగా అటవీ ప్రాంతం నుండి బయటకు తీసుకువచ్చారు. అధికారుల సకాల స్పందనతో విద్యార్థులు ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడటం గమనార్హం.

అధికారుల హెచ్చరికలు:

ప్రస్తుతం జలపాతాల సందర్శనకు అధికారికంగా అనుమతి లేదు. అయినప్పటికీ, పర్యాటకులు అధికారుల కళ్ళుగప్పి, నిషేధిత ప్రాంతాలకు వెళుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి చర్యలు వారి ప్రాణాలకే ముప్పు తెచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పర్యాటకులు అనుమతి లేని ప్రదేశాలకు వెళ్లవద్దని, నిబంధనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని, అటవీ ప్రాంతాల్లోకి అనధికార ప్రవేశాలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల మానవ హక్కుల సంఘం అధ్యక్షులు పవన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని టేక్మాల్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మానవ హక్కుల సంఘం మండల అధ్యక్షులు పవన్ అన్నారు. ఎక్కడ కూడా ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా మండల అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు వర్షాలు వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చిన ఎదుర్కొనేందుకు ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని తెలిపారు ప్రజలు తక్కువ ప్రాంతాల నుంచి పర్యవేక్షణలో ఉండి ఎలాంటి విపత్తులు ఎదురైతే అధికారులు లేదా స్థానిక నాయకులకు వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు నీటిలో ఉండే వంతెనలు కట్టలు దాటవద్దు జలపాతాలు వాగులు నదులు చెరువులకు వెళ్ళవద్దు అని తెలిపారు పురాతన భవనాలకు దగ్గరగా ఉండరాదు అని అన్నారు చేపల వేటకు వెళ్లేవారు వర్షాలు ఆగే వరకు ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

హనుమకొండ జిల్లా లో హాస్టల్ విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. 

గురువారం ఆరెపల్లిలోని గిరిజన ఆశ్రమ గురుకుల బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించారు. తరగతులు సందర్శన సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడగా తమకు మరికొన్ని పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉందని విద్యార్థులు చెప్పడంతో వెంటనే పాఠ్య పుస్తకాలు అందించాలని ఎంఈవో ను ఆదేశించారు. మెనూ ఎలా ఉంటుందని విద్యార్థులను కలెక్టర్ అడిగారు. స్టోర్ రూంలో ఉన్న నిత్యావసరాలను తనిఖీ చేశారు. పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. భోజనశాలలో విద్యార్థులకు వండిన అన్నం, కూరలను పరిశీలించారు. 


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ స్టోర్ రూమ్ లో సరిపోను  నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలన్నారు. కూరగాయలను ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని, విద్యార్థులకు అందించే భోజన పదార్థాలు తాజాగా, వేడిగా, రుచికరంగా ఉండాలని వార్డెన్ ను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని  ఏఎన్ఎం ను ఆదేశించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు.

ఈ సందర్భంగా జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ప్రేమకళ, దామెర ఎంపీడీవో కల్పన, ఏటిడివో రూపాదేవి, ఏవో నాగ సాగర్, ప్రధానోపాధ్యాయుడు సురేందర్ రెడ్డి, వార్డెన్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

 మహాలక్ష్మి పథకం తో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని హనుమకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) రమేష్ రాథోడ్ అన్నారు. మహాలక్ష్మి పథకం డిసెంబర్ 9, 2023 నుండి అమలై నేటి వరకు 200 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన సందర్భంగా స్థానిక హనుమకొండ బస్టాండ్ లో ఈరోజు ఆర్టీసీ వరంగల్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ కేశరాజు భానుకిరణ్ ఏర్పాటు చేసిన మహిళా అభినందన సభలో హనుమకొండ ఆర్డిఓ రమేష్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై ఉపన్యసించారు . ఈ సందర్భంగా రమేష్ రాథోడ్ మాట్లాడుతూ 200 కోట్ల మహిళా ప్రయాణికులను వారి గమ్మన స్థానానికి చేరవేర్చి రూపాయలు 6680 కోట్ల ప్రయాణం చార్జీలను ఆదా చేసినందుకు రాష్ట్ర మహిళలందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకప్పుడు ఆర్టీసీ నష్టాలు ఉండేదని కానీ నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో నష్టాలు పోయి లాభాల బాటలో కి వచ్చిందని అన్నారు. ప్రతి ఒక్క బస్సులో 70 శాతం మహిళా ప్రయాణికులు ఉంటే కేవలం 30 శాతం మాత్రమే పురుష ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని అన్నారు. మహిళలకు ఎన్నో పనులు ఉంటాయని ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు, కాలేజీలకు వాళ్లు మార్కెట్కు వచ్చేవాళ్ళు హాస్పిటల్లో పనిచేసేవాళ్లు, షాపుల్లో పనిచేసే వాళ్లు ఇంకా అనేక రంగాల్లో పనిచేసే వాళ్లు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఈ పథకం వల్ల మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారని ప్రయాణ ఖర్చులు పూర్తిగా ఉచితం అవడంతో వారి జీవనశైలి లో మార్పు వచ్చిందని అన్నారు. ఆర్టిసి కూడా అనేక డిపో లు నష్టాలు చవి చూశాయని ఈ పథకం వల్ల ఆర్టీసీ లాభాల బాట పట్టిందని అన్నారు. అంతేకాక ఈ పథకం వల్ల ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పూర్తిగా తగ్గిపోయిందని అన్నారు. ఈ పథకాన్ని రాష్ట్రంలోని మహిళలందరూ ఉపయోగించుకొని ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటున్నాను. అని అన్నారు. కార్యక్రమం ఉద్దేశించి డిప్యూటీ రీజినల్ మేనేజర్ కేశరాజు భాను కిరణ్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా పెరిగిన ప్రయాణికుల రద్దీ దృశ్య 112 ఎలక్ట్రికల్ బస్సులను వరంగల్ టూ డిపోలో ప్రవేశపెట్టామని 40 కొత్త డీజిల్ బస్సులను కూడా ప్రవేశపెట్టాలని అన్నారు ఏ టువంటి కంప్లైంట్స్ లేకుండా మహిళల రద్దీకణుగుణంగా ఈ బస్సులను ప్రవేశపెట్టామని అన్నారు దేశంలోనే కర్ణాటక రాష్ట్రం తర్వాత మన రాష్ట్రంలో ఈ పథకం ప్రవేశపెట్టిందని అలాగే మన రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఈ పథకం అమలవుతుందని అన్నారు డ్రైవర్ కండక్టర్లు బస్సులో ఎంతమంది ఎక్కిన ఇసుక్కోకుండా శ్రమ అనుకోకుండా పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తూ ప్రయాణికులందరిని క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుస్తున్న చేస్తున్నారని అన్నారు. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు అలాగే ఈ పథకానికి సహకరిస్తున్న మహిళ లందరికీ టీజీఎస్ఆర్టిసి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ మహాలక్ష్మి పథకం వరంగల్ రీజియన్ లో 15 కోట్ల 43 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలకు కాంపిటీషన్ పెట్టామని వారికి ఆర్టీసీ తరఫున అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఉపన్యాస పోటీలు, ఎస్సే రైటింగ్ పోటీలు పెట్టడం జరిగింది అని అన్నారు. ఈ పోటీలో గెలుపొందిన వారందరికీ ఆర్డిఓ రమేష్ రాథోడ్ చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. ఈ పోటీల్లో ఎస్సే రైటింగ్ లో ఆదిత్య 9th క్లాస్, ఎస్. జైవీర్ 8 th క్లాస్, కే సారిక డిగ్రీ థర్డ్ ఇయర్. బి సరిత బీఎస్సీ సెకండ్ ఇయర్, బి సరస్వతి బీకాం లు బహుమతులు గెలుచుకున్నారు అలాగే రెగ్యులర్ ప్రయాణికులకు సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో వరంగల్ 1 డిపో మేనేజర్ పి. అర్పిత , అసిస్టెంట్ మేనేజర్ సి.హెచ్. సంతోష్ కుమార్,

 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎం) అమల, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కీర్తి, ఆర్టీసీ సిబ్బంది, మరియు ప్రయాణికులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి  జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే  బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న మరో 3 రోజులు  భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలెవ్వరూ లోతట్టు ప్రాంతాలను, చెరువులు, కుంటలను గోదావరి, మానేరు నదులను చూడడానికి వెళ్లకూడదని, వెళితే  ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 87126 58129 ను సంప్రదించవలసిందిగా సూచించారు.  

జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది  అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలు వరద ప్రభావం ఉన్న ప్రజలను  అప్రమత్తం చేయాలని ఎస్పీ  తెలిపారు.భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు కింది సూచనలు పాటించాలని  ఎస్పీ  కోరారు.అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు. ప్రమాద కారణాల దృష్ట్యా చెరువులు, కుంటలను చూడటానికి వెళ్లరాదు. రైతులు పొలాలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలి. విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను కానీ చేతులతో తాకకకూడదు. నీరు నిలువ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గర నుండి వెళ్లరాదు. వాగులు వంకలు బ్రిడ్జ్ లపై నుండి పొంగి, ప్రవహించే సమయంలో దాటాడానికి ప్రయత్నించరాదు. పాడైన పాత భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల ప్రక్కన నివాసం ఉండరాదు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

హనుమకొండ జిల్లా లో గవర్నర్ ఆదేశాలమేరకు హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ లో బుధవారం సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హనుమకొండ జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు  స్నేహ శబరీష్,  పాల్గొన్నారు. కలెక్టర్ కి రెడ్ క్రాస్ చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులు పూల మొక్క అందించి స్వాగతం పలికారు.

ముందుగా రెడ్ క్రాస్ సొసైటీ లోని జనరిక్ మందుల షాప్, టైలరింగ్ శిక్షణ కేంద్రం, డే కేర్ సెంటర్ మంజూరి కొరకు సందర్శించి, తలసీమియా సెంటర్ ను సందర్శించి పిల్లలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. తలసీమియా బాధితులకు పండ్లు పంపిణి చేసినారు. తలసీమియా వ్యాధిగ్రస్తులకు రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలకు పాలకవర్గాన్ని అభినందించారు. పిదప రెడ్ క్రాస్ లో రెడ్ క్రాస్ ఆవరణలో మొక్క నాటారు.  

అనంతరం ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా 30 మంది టిబి (క్షయ) వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్లు (పౌష్టకాహారం కోడిగుడ్లు సరుకులు), కిట్లు కలెక్టర్ మరియు పాలకవర్గం చేతులమీదుగా ఉచితముగా పంపిణి చేసినారు. ఈ నెల నుండి ఆరు నెలల వరకు ప్రతి నెల 30 మందికి న్యూట్రిషన్ కిట్లు అందచేస్తామని పాలకవర్గం తెలిపారు. 

అనంతరం కలెక్టర్  కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా జూనియర్ మరియు యూత్ రెడ్ క్రాస్ కార్యక్రమాల గురించి అధికారులతో మీటింగ్ ఆరెంజ్ చేస్తాను అని తెలిపారు. అదేవిధంగా జీవితకాల సభ్యులను గురించి తెలుసుకుని సూచనలు చేసినారు. బ్లడ్ సెంటర్ లో భాగంగా రక్తదాన శిబిరాల గురించి, రెడ్ క్రాస్ నిధుల సమీకరణ గురించి ఈ సమావేశంలో చర్చించారు.

ఈ సందర్బంగా కలెక్టర్  మాట్లాడుతూ రక్తదాన కార్యక్రమమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు తలసీమియా బాధితులకు చేస్తున్న సేవలకు రెడ్ క్రాస్ పాలకవర్గాన్ని అభినందించారు.రెడ్ క్రాస్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని తెలిపారు.

కలెక్టర్ కు సన్మానం ...

రెడ్ క్రాస్ పాలకవర్గం కలెక్టర్ ని శాలువా, షీల్డ్ తో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు డా. పి. విజయచందర్ రెడ్డి (చైర్మన్), పెద్ది వెంకట నారాయణ గౌడ్ (వైస్ చైర్మన్), బొమ్మినేని పాపిరెడ్డి (కోశాధికారి), ఈ. వి. శ్రీనివాస్ రావు (రాష్ట్ర పాలకవర్గ సభ్యులు), జిల్లా పాలకవర్గ సభ్యులు : పుల్లూరు వేణు గోపాల్, డా. ఎం. శేషుమాధవ్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, డా. కె. సుధాకర్ రెడ్డి, చెన్నమనేని జయశ్రీ, బిళ్ళ రమణ రెడ్డి, హనుమకొండ  డిఎం అండ్ హెచ్ ఓ ఎ. అప్పయ్య, జిల్లా టిబి (క్షయ) నివారణాధికారి  కె. హిమబిందు మరియు రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

 హనుమకొండ జిల్లా లో వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలని  హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. 

బుధవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని ఉన్నతశ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా ఓపి విభాగాన్ని పరిశీలించి అక్కడ ఉన్న పేషెంట్స్ తో కలెక్టర్ మాట్లాడి ఆరోగ్య కేంద్రం ద్వారా అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలోని ఫార్మసీని సందర్శించి మందుల నిల్వలను  అడిగి తెలుసుకున్నారు. ఈ-ఔషధి పోర్టల్ లో  ఫార్మసికి కావాల్సిన మందులను  ఎలా ఇండెంట్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఉప కేంద్రాలకు మందులను ఏ విధంగా అందిస్తున్నారనే వివరాలను వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎన్సిడి కార్యక్రమంలో బీపీ,షుగర్ లాంటివి ఏ విధంగా స్క్రీనింగ్ చేస్తున్నారని, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు మందులను ఏ విధంగా అందుతున్నాయి అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తొలగింపు ప్రతిపాదనలో ఉన్న  ఆరోగ్య కేంద్రంలోని పేషంట్ వార్డ్, థియేటర్లను కలెక్టర్ పరిశీలించారు. అదేవిధంగా ఆరోగ్య కేంద్రంలోని ల్యాబ్ ను పరిశీలించి  నమూనాలను ఏ విధంగా సేకరిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. 

 అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ  ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రమైన వాతావరణము ఉండాలని, నిరంతరం పరిశుభ్రతను పాటించాలన్నారు. అవసరమైన మందులు అన్ని ఫార్మసీలో అందుబాటులో ఉంచాలన్నారు. 

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, యుపిహెచ్సి  వైద్యాధికారి డాక్టర్ భార్గవ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

తెలంగాణ ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రూపుదిద్దుకున్న భూభార‌తి చ‌ట్టం, ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చి ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాల్సిన బాద్య‌త జిల్లా క‌లెక్ట‌ర్ల‌దేన‌ని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. 

మంగళవారం  డాక్ట‌ర్ బి. ఆర్. అంబేద్క‌ర్  స‌చివాల‌యంలో చీఫ్ సెక్రటరీ కార్యాల‌యం నుంచి మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్,  చీఫ్ సెక్ర‌ట‌రీ కె. రామ‌కృష్ణారావుతో క‌లిసి   జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ భూ స‌మ‌స్య‌లు పరిష్కార‌మే ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన అద్భుత‌మైన భూ భార‌తి చ‌ట్టాన్ని ప‌క‌డ్బందీగా అమ‌లు చేసిన‌ప్పుడే దాని ఫ‌లితాలు సామాన్యుల‌కు అందుతాయ‌ని అన్నారు.  మూడు ద‌ఫాలుగా నిర్వ‌హించిన రెవెన్యూ స‌ద‌స్సుల్లో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిష్క‌రించ‌డానికి సామాన్యుల‌ను ముఖ్యంగా రైతుల‌ను ఇబ్బంది పెడితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సస్సెండ్ చేయ‌డానికైనా వెనుకాడ‌బోమ‌ని హెచ్చ‌రించారు. క్షేత్ర‌స్ధాయిలో కొంత‌మంది అధికారులు రైతుల‌ను ఇబ్బంది పెడుతున్నార‌నే స‌మాచారం ఉంద‌ని ఇది పున‌రావృతం కాకుండా చూడాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు. 

   

రెవెన్యూ స‌ద‌స్సుల్లో 8.65ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని ఇందులో ప్ర‌ధానంగా  సాదాబైనామా,  స‌ర్వేనెంబ‌ర్ మిస్సింగ్‌, అసైన్డ్ ల్యాండ్ , అసైన్డ్ ల్యాండ్ రెగ్యుల‌రైజేష‌న్‌, సక్సెష‌న్ కు సంబంధించి సుమారు 6 ల‌క్ష‌ల  ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని  వీటిని ఐదు విభాగాలుగా విభ‌జించి ప్ర‌తి ద‌ర‌ఖాస్తును స‌మ‌గ్రంగా ప‌రిశీల‌న జ‌రిపి ఆగ‌స్లు 15వ తేదీలోగా వీలైన‌న్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించాల‌న్నారు. సాదాబైనామాల అంశం ప్ర‌స్తుతం కోర్టు ప‌రిధిలో ఉంద‌ని కోర్టు తీర్పుకోసం వేచిచూడ‌కుండా ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి ప‌రిష్కారం కోసం  సిద్దం చేసుకోవాల‌న్నారు. జిల్లాల్లోని అసైన్డ్‌ల్యాండ్, ల‌బ్దిదారుల వివ‌రాల‌ను  ఈ నెల 30వ తేదీ లోగా ప్ర‌భుత్వానికి పంపించాల‌ని  క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు.  ద‌ర‌ఖాస్తుల సంఖ్య‌ను త‌గ్గించుకోవ‌డానికి  ఇష్టం వ‌చ్చిన రీతిలో  తిర‌స్క‌రించ‌కూడ‌ద‌ని, తిర‌స్కారానికి గ‌ల కార‌ణాల‌ను లిఖిత పూర్వ‌కంగా ద‌ర‌ఖాస్తుదారునికి తెలియ‌జేయాల‌ని సూచించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్దాయిలో ప్ర‌త్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఈనెల 27వ తేదీన  రాష్ట్ర వ్యాప్తంగా జిపీవోల‌కు ,   జె ఎన్ టి యు ఆధ్వ‌ర్యంలో లైసెన్స్ డ్ స‌ర్వేయ‌ర్ల‌కు ప‌రీక్ష నిర్వ‌హిస్తున్నామ‌ని ఇందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌ను చేసుకొని ప‌క‌డ్బందీగాప‌రీక్ష నిర్వ‌హించాల‌న్నారు. 

ఇంటి నిర్మాణంలో పేద‌వాడికి ఏ స‌మ‌స్య రాకూడ‌దు

పేద‌వాడి సొంతింటి క‌ల ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మ‌ణానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని ధ‌ర‌లు, చెల్లింపులు, ఇసుక, సిమ్మెంట్, స్టీల్ విష‌యంలో ఎలాంటి  ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఏ స‌మ‌స్య రాకుండా చూడాల‌ని అలాగే ధ‌ర‌ల నియంత్ర‌ణ కమిటీ చురుగ్గా ప‌నిచేసేలా క‌లెక్ట‌ర్లు నిత్యం ప‌ర్య‌వేక్షించాల‌న్నారు.

ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం కోసం అవ‌స‌ర‌మైన ఇసుక‌ను ప్ర‌భుత్వం ఉచితంగా అందిస్తుంద‌ని , ఇది స‌రైన విధంగా ల‌బ్దిదారుల‌కు అందేలా క‌లెక్ట‌ర్లు చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు. ల‌బ్దిదారుల‌పై ర‌వాణా భారం అధికంగా ప‌డ‌కుండా వీలైనంత దగ్గ‌ర‌లో ఇసుక అందేవిధంగా చూడాల‌న్నారు.  బేస్‌మెంట్ నిర్మాణం కోసం అక్క‌డ‌క్క‌డ అందుబాటులో ఉన్న మ‌ట్టిని తీసుకెళ్తున్న ల‌బ్దిదారుల‌పై పోలీసులు కేసులు న‌మోదుచేయ‌డం స‌రైన చ‌ర్య కాద‌ని  ఇలాంటి చ‌ర్య‌లు పున‌రావృతం కాకుండా  క‌లెక్ట‌ర్లు, సి. పి, ఎస్పీలు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.  ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 జాబితాల‌తో సంబంధం లేకుండా నిరుపేద‌లైతే ఇల్లు కేటాయించాల‌న్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులున్నాకూడా ప్ర‌తి సోమ‌వారం చెల్లింపులు జ‌రుపుతున్నామ‌ని అయితే సాంకేతిక స‌మ‌స్య‌ల‌తో కొంత‌మంది ల‌బ్దిదారుల ఖాతాలో డ‌బ్బులు జ‌మ కావ‌డం లేద‌ని ఇటువంటి స‌మ‌స్య‌ల‌ను ముందుగానే గుర్తించి ల‌బ్దిదారునికి ఇబ్బంది లేకుండా చూడాల‌న్నారు. 2 బిహెచ్‌కే ఇండ్ల‌కు సంబంధించి స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించి అర్హులైనల‌బ్దిదారుల‌కు కేటాయించాల‌న్నారు.

ఈసందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందని, క్షేత్రస్థాయిలో  జిల్లా కలెక్టర్లు, అధికారులు ముఖ్య పాత్ర పోషించాలని, పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఎన్నో పథకాల ఫలితాలను వారికి అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, దానికగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించు కోవాలని మంత్రులు స్పష్టం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం సరఫరా...

గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల కనుగుణం సాంఘిక, బిసి, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, హాస్టళ్లలో నిర్వాహణపై ఎప్పుటికప్పుడు తనిఖీలు నిర్వహించి వారంలో ఒక్కరోజు అధికారులందరూ ఆ హాస్టళ్లలో బస చేయాలని కలెక్టర్లను మంత్రులు ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లకు వీటి నిర్వాహణపై పలు సూచనలు చేశారు. పెంచిన డైట్‌ ఛార్జీలకు అనుగుణంగా నాణ్యమైన భోజన వసతి కల్పించాలని ఆదేశించారు. హాస్టళ్లలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని, వారి నుంచి ఎలాంటి ఫిర్యాదులు రావొద్దని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రులు  పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమారులు జిల్లా  కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. హాస్టళ్ల ప్రాంగణాల్లో పచ్చదనం పరిశుభ్రతల్లో భాగంగా శానిటేషన్‌ను చేపట్టాలని, అన్ని జిల్లాల్లో ఎగ్‌ టెండర్స్‌ ప్రక్రియను  త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో నెలకోసారి పేరెంట్స్‌ కమిటీ మీటింగ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.

మహాలక్ష్మి పథకంలో భాగంగా రేపటికి 200 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని, ఈ సందర్భంగా 97 బస్సు డిపోలు, 321 బస్‌స్టేషన్లలో వేడుకలను నిర్వహించాలని సూచించారు. 

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రగతి సాధించాలి...

  వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి  కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, జి డబ్ల్యు ఎం సి కమిషనర్ చాహత్ బాచ్ పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై వి గణేష్, డిఆర్డిఓ మేన శ్రీను, డీఎంహెచ్వో అప్పయ్య, డీఈఓ వాసంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ  శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు  తెలిపారు.

సోమవారం గోరి కొత్తపల్లి మండలంలో నూతనంగా నిర్మితమైన పోలీస్ స్టేషన్‌ను భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్  రాహుల్ శర్మ,  ఎస్పీ కిరణ్ ఖరేలతో కలిసి ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు సభలో మంత్రులు మాట్లాడుతూ  సమాజంలో శాంతి భద్రతలు, చట్టవ్యవస్థ పటిష్టంగా ఉండేలా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు గోరి కొత్తపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటైనందుకు హర్షం వ్యక్తం చేశారు. ఇది స్థానిక ప్రజలకు రక్షణకు  భాసటగా నిలుస్తుందని తెలిపారు. అంతకుముందు మంత్రులు

పీఎస్ నూతన భవనంలో నూతన ఎస్సై దివ్యను, కుర్చీలో కూర్చోబెట్టి, అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ 

సోమవారం నుంచి  కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్  సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయని ప్రజలు ఏ సమస్య ఉన్న పోలీసులను ఆశ్రయించి, తమ సమస్యలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్ కుమార్, కాకాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, భూపాలపల్లి డిఎస్పీ సంపత్ రావు, జిల్లా అధికార యంత్రాంగం, వివిధ  మండలాల నుంచి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 

ఉమ్మడి వరంగల్;

జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు మండల కేంద్రాలలో రేషన్ కార్డుల పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 

సోమవారం వానాకాలం సాగు, భారీ వర్షాలు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, రేషన్ కార్డుల పంపిణీ వంటి పలు అంశాల పై   సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి , వాకాటి శ్రీహరి, సీతక్క, శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణా రావు  హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి  అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్  పాల్గొన్నారు. 


సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,   గత ఏడాది ఖమ్మం జిల్లాలో మూడు గంటల వ్యవధిలో 39 సెంటీ మీటర్ల భారీ వర్షం పడిందని, ప్రస్తుతం కూడా అటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ కలెక్టర్ లను ఆదేశించారు.  వర్షాల నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబల కుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యవసాయ సాగు పనులు సజావుగా జరిగేందుకు అవసరమైన ఎరువులు విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచడం, నీటిపారుదల శాఖ ద్వారా రైతులకు సాగునీరు విడుదల పై కలెక్టర్ దృష్టి సారించాలని అన్నారు. 

జూలై 21 వరకు మన రాష్ట్రంలో దాదాపు 20 శాతం లోటు వర్షపాతం నమోదైందని, గత 3 రోజులు గా వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలను అప్రమత్తం చేయాలని, జిహెచ్ఎంసి పరిధిలో హైదరా ఆధ్వర్యంలో 150 బృందాలను సిద్దం చేశామని అన్నారు. నగరంలో వర్షాలు ఉన్నప్పుడు ట్రాఫిక్ నియంత్రణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. 

గ్రామీణ ప్రాంతాల్లో పిడుగు పాటుకు మరణాలు సంభవిస్తున్నాయని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని వర్షాలు వచ్చినప్పుడు చెట్ల కింద స్తంభాల దగ్గర ఉండకుండా చూడాలని అన్నారు.  పిడుగు పాటుతో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని, దీనికోసం పోలీసు అధికారులు వెంటనే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని అన్నారు.

వర్షాకాలంలో వచ్చే అంటూ రోగాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ముఖ్యంగా ఐటీడీఏ గిరిజన ప్రాంతాల్లో అధిక శ్రద్ధ వహించాలని అన్నారు. నీటి నిల్వ లేకుండా చూడాలని, ఎక్కడైనా వర్షపు నీరు నిల్వ ఉంటే అక్కడ ఆయిల్ బాల్స్ వంటివి స్థానిక సంస్థల ద్వారా వేయాలని అన్నారు. డ్రైయినేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆస్పత్రి వరకు వైద్యులు సిబ్బంది సకాలంలో విధులకు హాజరయ్యేలా చూడాలని , ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును కలెక్టర్లు పర్యవేక్షించాలని అన్నారు. 

జిల్లా పరిధిలో ఉన్న ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలు అధికంగా నిర్వహించాలని, ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీ చేసి పనితీరు పర్యవేక్షించాలని అన్నారు. అత్యవసర సమయంలో కలెక్టర్లు ఖర్చు చేసేందుకు నిధులు కూడా అందుబాటులో పెట్టడం జరుగుతుందని అన్నారు. 

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మన ప్రాజెక్టులలో నీరు నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.  గత సంవత్సరం మన రాష్ట్రంలో దేశంలోనే అత్యధికంగా రెండు కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వారి ఉత్పత్తి చేశామని అన్నారు. గోదావరి బేసిన్ లో ప్రాజెక్టులలో నీరు తక్కువగా ఉందని, ఇక్కడ నీరు వృధాగా పోకుండా ప్రాజెక్టులలో ఎప్పటికప్పుడు నింపాలని అన్నారు. 

వ్యవసాయ శాఖ అధికారులు నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు.  రైతులకు అవసరమైన విత్తనాలు, యూరియా అందుబాటులో ఉండాలని అన్నారు.  విత్తనాల, ఎరువులు అక్రమ స్టాక్ ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నకిలి విత్తనాల అమ్మే వారి పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని అన్నారు.

ప్రతి జిల్లాలో ఎరువుల స్టాక్ ఎంత అందుబాటులో ఉందో కలెక్టర్  రెగ్యులర్ గా ప్రకటనలు విడుదల చేయాలని, ప్రతి ఎరువుల షాప్ వద్ద స్టాక్ వివరాలు నోటీసు బోర్డులు పెట్టాలని, ఇద్దరూ  పోలీస్ అధికారులను నియంత్రణకు పెట్టాలని అన్నారు. ఎరువుల లభ్యత పై అసత్య ప్రచారాలను గట్టిగా తిప్పి కొట్టాలని సీఎం పేర్కోన్నారు. రైతులకు సకాలంలో అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని, రైతులు ముందస్తుగా ఎరువుల స్టాక్ పెట్టుకోకుండా అవగాహన కలిగించాలని అన్నారు.

20 నుంచి 25 శాతం ఎరువులు వ్యవసాయ అవసరాల కోసం కాకుండా ఇతర అంశాలకు, డీజిల్ వాహనాలలో పొగ తగ్గించేందుకు సబ్సిడీ ఎరువులు వినియోగిస్తున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారని సీఎం అన్నారు.  రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉంటూ సబ్సిడీ ఎరువులు దారి మళ్ళించకుండా చూడాలని అన్నారు.

వ్యవసాయ అవసరాలకు కాకుండా ఇతర అంశాలకు యూరియా వినియోగిస్తే కఠినంగా వ్యవహరించాలని క్రిమినల్ కేసుల నమోదు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఎరువుల అంశంలో ఫిర్యాదులను నమోదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ జిల్లాలలో ప్రచారం చేయాలని అన్నారు. 

రాష్ట్రంలో నూతనంగా దాదాపు 7 లక్షల రేషన్ కార్డులను ,31 లక్షల లబ్ధిదారులతో మంజూరు చేసామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 96 లక్షల 96 వేల రేషన్ కార్డులు ఉన్నాయని, 3 కోట్ల 10 లక్షల మంది లబ్ధిదారులు రేషన్ కార్డు ఉపయోగిస్తున్నారని అన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఉన్నప్పుడు ప్రజలు ఎక్కువ పట్టించుకోలేదని బ్లాక్ మార్కెట్లో పోయేదని, ప్రస్తుతం సన్న బియ్యం సరఫరా చేయడంతో చాలా డిమాండ్ వచ్చిందని, ప్రజలు తప్పనిసరిగా రేషన్ తీసుకుంటున్నారని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. 

జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు మండల కేంద్రాలలో అధికారికంగా రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని, వీటిలో తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్ పాల్గొనేలా చూడాలని సీఎం తెలిపారు. 

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఒక చోట ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి  ఒక చోట పాల్గోనేలా కలెక్టర్ కోఆర్డినేట్ చేసుకోవాలని సీఎం తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆర్డిఓ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలని అన్నారు. వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ కిందిస్థాయి సిబ్బంది అధికారులు ప్రజలను కలెక్టర్ అప్రమత్తం చేయాలని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జి డబ్ల్యు ఎం సి కమిషనర్ చాహత్ బాజ్ 

పాయ్, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డిఎంహెచ్ఓ అప్పయ్య, డి ఏ ఓ రవీందర్ సింగ్, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 

ఉమ్మడి వరంగల్;

కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడిగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  అన్నారు.వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నూతనంగా 2469 మంది లబ్ధిదారులకు ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో నగర మేయర్  గుండు సుధారాణి 

తో కాలిస్ ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం అట్టడుగు వర్గాలకు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.గతంలో ప్రవేశ పెట్టిన పథకాలు ఆరోగ్య శ్రీ,104,108,రేషన్ కార్డుల పంపిణీ,ఇందిరమ్మ ఇళ్లు వంటివి పేదలకు బాసటగా నిలిచాయని నేడు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు,ఉచిత బస్సు ప్రయాణం,కొత్త రేషన్ కార్డుల మంజూరు,రుణమాఫీ వంటి పథకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని అన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో రాని ఆలోచన విధానం ఈ రోజు సన్నబియ్యం పథకం ద్వారా ప్రతి ఇంటికి సన్నబియ్యం సరఫరా అవుతుందని చెప్పారు.ప్రభుత్వంపై ఉన్న భారాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయం చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నదని అన్నారు .ఆరు గ్యారెంటీలను దశల వారీగా అమలు చేస్తున్న కూడా ప్రతిపక్ష పార్టీ నేతలు అభివృద్ధి జరగటం లేదనడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.పేదేళ్లలో ఒక్కరికి రేషన్ కార్డివ్వని అసమర్థులు నేడు ప్రజా ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులను అర్హులకు అందజేస్తుంటే జిత్నించుకోలేక విమర్శిస్తున్నారని అన్నారు.

శవాల మీద పేలాలు పెట్టి రాజకీయం చేస్తున్న పార్టీలకు మా అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు చెంపపెట్టులా ఉంటాయని దుయ్యబట్టారు.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు సంపాదించిన భూమిని కేటాయించినట్లు గుర్తు చేశారు.మీ హయాంలో పథకం అమలు జరగాలంటే కార్యకర్తలు,ఎమ్మెల్యే బంధువులకు తప్ప మరొకరికి ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు.ప్రజలు నమ్మకంతో మాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సమిష్టి కృషితో జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా అభివృద్ధి చేస్తున్నామని రానున్న రోజుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం,క్రీడా పాఠశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి  ఆమోదం తెలిపారని అన్నారు.

చిత్తశుద్ధితో పని చేయాలని నిత్యం ప్రజల తరఫున పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల సహాయ సహకారాలు ఉంటే మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే నాయిని తెలిపారు.పుట్టిన రోజు అయినప్పటికీ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రద్దు చేయడం సభబు కాదని కార్యక్రమాన్ని సాగించామని తెలిపారు.

ఈ కార్యక్రమాంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

హైదరాబాదులో సుందరయ్య విజ్ఞానభవన్లో ఆదివారం నిర్వహించిన జర్నలిస్టు స్వేచ్ఛ సంస్కరణసభ మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన సభలో పలువురు మాట్లాడారు.నేటి జర్నలిజం సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ వ్యక్తిగత జీవితాలను హనం చేస్తూ దిగజారిపోతున్న జర్నలిజాన్ని చూస్తే చాలాబాధ కలిగిస్తున్నాయి అంటూ ఆవేదన వ్యక్తపరిచారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ.శ్రీదేవి,శంకరన్న,అరణ్య.సంధ్యా.నరసయ్య.ప్రసాద్ మూర్తి.వికే ప్రభాకర్ వి సుభద్ర.నోద్.విజయ.పసునూరి రవీందర్.సూరపేల్లి సుజాత,ప్రభాకర్.పద్మ గోపరాజు.విమలక్క.లక్ష్మీదేవి. ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందినవారికి మాత్రమే షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) రిజర్వేషన్లు వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఇతర మతాలకు చెందినవారు, ముఖ్యంగా క్రైస్తవులు మరియు ముస్లింలు ఎస్సీ సర్టిఫికెట్లు పొందితే అవి చట్టబద్ధంగా చెల్లవని ఆయన తేల్చి చెప్పారు.

ఫడ్నవీస్ వ్యాఖ్యల ముఖ్యాంశాలు మరియు వాటి వివరణ:

ఎస్సీ రిజర్వేషన్లు హిందూ, బౌద్ధ, సిక్కు మతస్థులకు మాత్రమే: భారత రాజ్యాంగం ప్రకారం, షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చబడిన వర్గాలు సాధారణంగా హిందూ మతంలో ఉన్నవారికి చెందినవి. కాలక్రమేణా, బౌద్ధ మరియు సిక్కు మతాలకు మారిన ఎస్సీ వర్గాలకు కూడా ఈ రిజర్వేషన్లు వర్తింపజేయబడ్డాయి. ఫడ్నవీస్ ప్రకటన ఈ చట్టపరమైన నిబంధనలను పునరుద్ఘాటించింది. ఇతర మతాలకు మారిన వారికి (ఉదాహరణకు, క్రైస్తవం లేదా ఇస్లాం) సాంప్రదాయకంగా ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవు.

ఇతర మతస్థులు ఎస్సీ సర్టిఫికెట్‌తో రిజర్వేషన్లు పొందినవారు అర్హులు కారు: 

ఎస్సీ కాని మతాలకు చెందిన వ్యక్తులు, తప్పుడు సమాచారం లేదా మోసం ద్వారా ఎస్సీ సర్టిఫికెట్లను పొంది, రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందుతున్నారని ఫడ్నవీస్ ఆరోపించారు. ఇలాంటి సర్టిఫికెట్లు చట్టవిరుద్ధమని, వాటిని ఉపయోగించి లబ్ధి పొందినవారు అర్హులు కారని ఆయన స్పష్టం చేశారు.

తప్పుడు సమాచారం ఆధారంగా రిజర్వేషన్ల లబ్ధి పొందిన వారిపై చర్యలు: 

తప్పుడు పత్రాలు సమర్పించడం ద్వారా లేదా మతమార్పిడుల ద్వారా ఎస్సీ రిజర్వేషన్లను పొందిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఫడ్నవీస్ హెచ్చరించారు. ఇది మోసపూరిత కార్యకలాపంగా పరిగణించబడుతుంది.

లబ్ధి పొందిన వారితో చెల్లించబడిన నిధులను తిరిగి వసూలు: 

అక్రమంగా ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు, విద్యా అవకాశాలు లేదా ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందిన వారి నుండి పొందిన ప్రయోజనాల విలువను తిరిగి వసూలు చేస్తామని ఫడ్నవీస్ ప్రకటించారు. ఇది అక్రమ లబ్ధిదారులపై ఆర్థికపరమైన భారాన్ని మోపుతుంది.

 మత మార్పిడులు చేసి కూడా ఎస్సీ రిజర్వేషన్లు పొందడమంటే ఇది మోసం: 

కొంతమంది వ్యక్తులు ఎస్సీ రిజర్వేషన్లను కొనసాగించడం కోసం లేదా పొందడం కోసం మత మార్పిడులకు పాల్పడుతున్నారని ఫడ్నవీస్ ఆరోపించారు. మతమార్పిడి అనేది ఒక వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన అంశం అయినప్పటికీ, రిజర్వేషన్ల ప్రయోజనం కోసం మతమార్పిడులు చేయడం మోసపూరిత చర్యగా పరిగణించబడుతుందని ఆయన అన్నారు.

 బలవంతపు లేదా మోసపూరిత మత మార్పిడులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిక: 

బలవంతంగా లేదా మోసం ద్వారా మత మార్పిడులు జరిగితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఫడ్నవీస్ నొక్కి చెప్పారు. ఇది మత స్వేచ్ఛను దుర్వినియోగం చేయడాన్ని నిరోధించడానికి ఉద్దేశించబడింది.

రాజకీయ మరియు సామాజిక ప్రభావం:

ఫడ్నవీస్ ప్రకటన రాష్ట్రంలో గణనీయమైన రాజకీయ చర్చకు దారితీసింది.

 ఆందోళనలు: ఇప్పటికే ఇతర మతాలకు చెందిన కొందరు ఎస్సీ సర్టిఫికెట్ దారులు ఈ ప్రకటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ హక్కులు కాలరాయబడుతున్నాయని వారు భావిస్తున్నారు.

 కోర్టు వ్యవహారాలు: ఈ చర్యలు కోర్టు వ్యవహారాలకు దారితీయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. రిజర్వేషన్ల చట్టపరమైన స్థితి మరియు మత మార్పిడుల ప్రభావంపై న్యాయపరమైన సవాళ్లు ఎదురుకావచ్చు.

 ప్రజాస్వామ్య సూత్రాలు: కొంతమంది విశ్లేషకులు ఈ చర్యలు ప్రజాస్వామ్య సూత్రాలను ప్రభావితం చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు, ముఖ్యంగా మైనారిటీల హక్కులకు సంబంధించి.

 రాజకీయ సమీకరణలు: ఈ ప్రకటన రాబోయే ఎన్నికలలో రాజకీయ సమీకరణలను ప్రభావితం చేయవచ్చు, ముఖ్యంగా వివిధ మత మరియు సామాజిక వర్గాల ఓటు బ్యాంకులను దృష్టిలో ఉంచుకొని.

 సామాజిక ఉద్రిక్తతలు: ఈ వివాదాస్పద ప్రకటన సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలకు దారితీయవచ్చనే ఆందోళనలు కూడా ఉన్నాయి.

మొత్తంమీద, దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన ఈ ప్రకటన కేవలం రిజర్వేషన్ల అంశానికి మాత్రమే పరిమితం కాకుండా, మత స్వేచ్ఛ, మోసం, రాజ్యాంగ హక్కులు మరియు రాజకీయాల పరంగా విస్తృతమైన చిక్కులను కలిగి ఉంది. దీని భవిష్యత్ పరిణామాలు మహారాష్ట్ర రాజకీయ మరియు సామాజిక వాతావరణంలో కీలక పాత్ర పోషించనున్నాయి.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

తెలంగాణ, జూలై 16, 2025 – తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ రాష్ట్ర సమితి (BRS) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR)తో మాజీ మంత్రి, సీనియర్ నేత హరీశ్ రావు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై అనుసరించాల్సిన వ్యూహాలపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

ఈ భేటీలో బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి చేపట్టాల్సిన ప్రత్యక్ష పోరాట కార్యాచరణపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇరువురు నేతలు ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగే నష్టాలు, దానిని ఎలా నిరోధించాలనే దానిపై లోతుగా విశ్లేషించారు. భవిష్యత్తు కార్యాచరణ, ప్రజలను ఏ విధంగా సమీకరించాలి, ప్రభుత్వ తీరును ఎలా ఎండగట్టాలి అనే అంశాలపై వ్యూహాలను రూపొందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

బనకచర్ల ప్రాజెక్టు: వివాదాస్పద నేపథ్యం

బనకచర్ల ప్రాజెక్టు రాయలసీమకు సాగునీరు అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఒక ఎత్తిపోతల పథకం. అయితే, ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలంగాణ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా జలాల కేటాయింపుల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటాకు ఇది విఘాతం కలిగిస్తుందని విమర్శలు వస్తున్నాయి.

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ భేటీ, రేవంత్ సర్కారు వైఖరి

ఇదిలావుండగా, ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో త్వరలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టు అంశం ఎజెండాలో ఉండటం గమనార్హం. అయితే, తెలంగాణలోని రేవంత్ సర్కారు ఈ బనకచర్ల ప్రాజెక్టు ఎజెండాను తొలగించాలని కేంద్రాన్ని ఇప్పటికే కోరింది. ప్రాజెక్టు అనుమతులకు సంబంధించి వివాదాలు ఉన్నందున దీనిపై చర్చ అనవసరమని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.

BRS భవిష్యత్తు కార్యాచరణ

BRS పార్టీ KCR, హరీశ్ రావుల భేటీ అనంతరం బనకచర్ల ప్రాజెక్టుపై తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను చేపట్టే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకంపై నెలకొన్న వివాదాలను పరిష్కరించడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

       


గోదావరిఖనిరూరల్,జూలై.15(విజన్ఆంధ్ర)లొంగిపోయిన మావోయిస్టులు నాలుగు దశాబ్దాలపాటు సిపిఐ  మావోయిస్టులో పనిచేసి లొంగిపోయిన సీనియర్ మావోయిస్టు నాయకులు ఆత్రం లచ్చన్న,ఎస్ సిఎం,చౌదరి ఆంకుభాయి,డీసీఎం లు లొంగిపోయారు.లచ్చన్నకు 20 లక్షల చెక్కు,అంకుబాయికి ఐదు లక్షల చెక్కును రామగుండం సిపి వారికి అందజేశారు.ఈ సందర్భంగా సిపి మాట్లాడారు అజ్ఞాతంలో ఉన్న అదిలాబాద్,కరీంనగర్ జిల్లా మావోయిస్టులు కూడా వారి గ్రామాలకు తిరిగి రావాలని కోరుతున్నాం అని అన్నారు.జనజీవన స్రవంతిలోకి వచ్చేవారికి లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు తెలంగాణ ప్రభుత్వం అందించే రివార్డుతోపాటు పునరావాస పథకంకింద లభించే పథకాలు  అందచేస్తాంఅని వీరి జీవనోపాధికై అందిస్తున్న చెక్కులే నిదర్శనం అని తెలిపారు.


ఈ సందర్భంగా మావోయిస్టు దంపతులు మాట్లాడారు.తెలంగాణ ప్రభుత్వం,పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి వివిధరకాల సహాయ సహాకారాలు.లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకుని,తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని,రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఎదుట లొంగిపోతున్నట్టు తెలిపారు.మావోయిస్టు పార్టీ గాడి తప్పిందని నాయకత్వ విధానాలు సరిగా లేవని ఆరోగ్య కారణాలవల్ల జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్టు తెలిపారు.ఆత్రం లచ్చన్న@ గోపన్న రాజప్ప తండ్రి భీమయ్య వయసు 60 సం.లు. గ్రామం పారాపేల్లి,కోటపల్లి మండలo.మంచిర్యాల జిల్లా.2007 సంవత్సరం నుండి నార్త్ బస్టర్ ఛత్తీస్గఢ్లో టెక్నీషియన్ గా లొంగిపోయేంతవరకు లచ్చన్న అక్కడే పనిచాడు.ఆత్రం లచ్చన్నపై తెలంగాణలోని వివిధ జిల్లాలలో 35 కేసులు నమోదుఅయ్యాయి.చౌదరి ఆంకుభాయి@అనితక్క@లక్ష్మి,భర్త ఆత్రం లచ్చన్న @గోపన్న,వయస్సు55సంవత్సరాలు,కులం.బిసి(ఆరే)ఆగరగుడా,బెజ్జూర్ మండలం,(కొమురంభీం అసిఫాబాద్ జిల్లా)అనితక్క 1988 వ సంవత్సరంలో తన అన్న చౌదరి చిన్నన్న ప్రోత్సాహంతో అప్పటి పీపుల్స్ వార్లో దళ సభ్యురాలిగా చేరి సిర్పూర్  దళంలో పనిచేస్తున్న తరుణంలో సిర్పూర్ దళం డిప్యూటీ కమాండర్ గా పనిచేస్తున్న ఆత్రం లచ్చన్నని వివాహం చేసుకుంది.1995 వరకు సిర్పూర్ దళంలోనే పనిచేసి 1995 లో తన భర్త లచ్చన్నతో పాటు పట్టణ ప్రాంతానికి బదిలీ అయి 2002 సంవత్సరంలో ఏసీఎం గా పదోన్నతి పొంది డీకే ఎస్ జెడ్సిలోని టెక్నికల్ డిపార్ట్మెంట్ కి తన భర్తతో పాటుగా బదిలీ అయ్యింది.2007 సంవత్సరంలో నార్త్ బస్తర్ డివిసి టెక్నికల్ డిపార్ట్మెంట్ కి బదిలీ అయ్యింది.లొంగిపోయేంతవరకు నార్త్ బస్తర్ లోని టెక్నికల్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు.చౌదరి ఆంకుభాయిపై కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 14 కేసులు కేసులు ఉన్నాయని తెలిపారు.రామగుండం కమిషనరేటు పోలీసుశాఖ తరుపున,అజ్ఞాతములో ఉన్న మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి రావాలిసినదిగా కోరుచున్నామని తెలిపారు.తెలంగాణ మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి రావాలని,తెలంగాణ అభివృద్దికి తోడ్పడాలని కోరుతున్నాము.అజ్ఞాత మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి వచ్చినట్లయితే,తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు ఇచ్చే పునరావాస పథకాలు మరియు ఇతర సహాయ సహకారాలు అందిస్తుంది.వారు స్వతంత్రంగా జీవించే విధంగా ప్రభుత్వం వారికి  అన్నీవిధాల తోడ్పాటును అందిస్తుంది.లొంగిపోయిన సభ్యులకు జీవనోపాధి పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని ప్రతిఫలాలను అందజేయడానికి రామగుండం కమిషనరేటు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది అని హామీ ఇస్తున్నాం.ప్రజా సంఘాల ముసుగులో,దందాలు కొంతమంది వ్యక్తులు ప్రజా సంఘాల ముసుగులో శాంతి భద్రతలకు భంగం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారు.అలాంటి వారిపై పోలీసుల నిఘా కొనసాగుతుంది.వారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి.యువత మరియు ప్రజలు ఇటువంటి వారికి దూరంగా ఉండాలి.మావోయిస్టులకు నేటి యువత దూరం.ప్రస్తుత సమాజంలో యువత చైతన్యవంతంగా వ్యవహరిస్తున్నది.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వారు దూరంగా ఉంటున్నారు.మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్మెంట్ పూర్తిగా తగ్గిపోయింది.చదువుతున్న వారు ఎవరు మావోయిస్టు పార్టీలోకి వెళ్ళడం లేదని.కాలం చెల్లిన సిద్ధాంతం మావోయిజం.నేటి ప్రపంచంలో మావోయిజం కాలం చెల్లిన సిద్ధాంతంగా మిగిలిపోయినది.హింసను ప్రేరేపించే సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించారు.ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ మావోయిజం కనుమరుగైపోయింది తెలిపారు.ఈ మీడియా సమావేశంలో మంచిర్యాల డిసిపి భాస్కర్ ఐపీఎస్,అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు,జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మల్లారెడ్డి,చెన్నూరు రూరల్ సీఐ బన్సీలాల్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్,కోటపల్లి ఎస్సై రాజేందర్,నీల్వాయి ఎస్సై శ్యాం పటేల్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం ఎస్సీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలను పిఆర్టియు మండల శాఖ ఆధ్వర్యంలో  పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈ ఒక్క పాఠశాలలో మొత్తం 26 మంది విద్యార్థులు ఉన్నారు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాల నిర్వహణ గత రెండు సంవత్సరాల నుండి ఒక అద్దె ఇంట్లో విద్య బోధన జరుగుతున్నది.


ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. కాటారం నడిబొడ్డున ఉన్న పాఠశాల పరిస్థితి ఇంత అద్వానంగా ఉండడం , పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలలో కనీసం పాఠశాల భవనం లేకపోవడం ఇక్కడ ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయులు ముఖ్యంగా వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పాఠశాల భవనాన్ని వెంటనే నిర్మించాలి.


రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటుంటే, ఇక్కడ మాత్రం కనీసం విద్యార్థులు చదువుకోడానికి కనీసం తరగతి గదే కరువైపోయింది. స్థానిక నాయకులు, సంబంధిత అధికారులు అవసరమైతే స్థానిక మంత్రి శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని కోరడం జరిగింది

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

PRTU లో సభ్యత్వమే ఒక వరం కాటారం మండలంలో రెండవ రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉధృతంగా జరిగింది. ఈరోజు కాటారం మరియు ధన్వాడ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. 


ఈ ఒక్కరోజే 38 మంది సభ్యులు తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు అని , ఇప్పటివరకు ఉపాధ్యాయులకు ఉన్నటువంటి మెజారిటీ సమస్యలు , ఇప్పుడు ఉపాధ్యాయులు అనుభవిస్తున్నటువంటి అన్ని సౌకర్యాలు , అన్ని జీవోలు తీసుకువచ్చిన చరిత్ర పి ఆర్ టి యు సంఘానిది అని , కావున ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు సంఘంలో తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకొని సంగం మరింత పట్టిష్టవంతంగా ముందుకు వెళ్లడానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు A.రవీందర్,A.తిరుపతి , జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మండల అసోసియేట్ అధ్యక్షులు ఎస్ సతీష్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉపాధ్యాయుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేసే ఏకైక సంఘం PRTU ట్స్రా ష్ట్ర జిల్లా శాఖ ఆదేశాల మేరకు ఈరోజు కాటారం మండలంలోని చింతకాని ఉన్నత పాఠశాల లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మండలంలోని పలు పాఠశాలలలో ఉపాధ్యాయులు తమ సభ్యత్వం నమోదు చేసుకున్నారని మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆంగోతు రవీందర్, అనపర్తి తిరుపతి తెలిపారు.


అంకుశ పూర్ ప్రాథమికోన్నత పాఠశాల లోని ఉపాధ్యాయుల సభ్యత్వ నమోదు సందర్భంగా  మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ సమస్యలు మా దృష్టికి తీసుకు వచ్చినట్లయితే   పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఎన్ సురేష్ రావు , జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరిన్ని హెడ్ లైన్స్

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి.గోదావరిఖని:జూలై11.2024(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్):కలెక్టర్ ఆధ్వర్యంలో పల్లె దవాఖానల ఎన్ క్యూఏఎస్ జాతీయ నాణ్యత ప్రమాణంలో భాగంగా జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలలో సౌకర్యాలు సేవలపై కేంద్ర మినిస్టర్ ఆఫ్ హెల్త్ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఆరోగ్యం నాణ్యతలు సేవలు సీజన్ వ్యాధుల గురించి ఎలా జరుగుతున్నాయి అని వర్చువల్గా మినిస్టరీ ఆఫ్ హెల్త్ సర్వీస్ నుండి,పెద్దపల్లి జిల్లా,రామగిరి మండలం,ముస్త్యాల గ్రామ పల్లె దవాఖాన ఆయుష్ ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం సేవలు నాణ్యతపై ఆన్లైన్లో ఆరోగ్య మందిర సిబ్బందితో ఇంటరాక్ట్ కాన్ఫరెన్స్ నిర్వహించినారు.


ఇట్టి కార్యక్రమాన్ని పెద్దపెల్లి జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రసన్న కుమారి ప్రారంభించారు.ప్రజలకు వైద్య సేవలు గురించి ముందస్తు సీజన్ వ్యాధుల గురించి జాగ్రత్తలు తీసుకోవలసిన విధానాలను వివరించారు.ముందుగా పల్లె దవాఖాన ముందు కాలుష్యం ఆక్సిజన్ పకృతి పచ్చదనం అనే అంశంపై మొక్కలు నాటినారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రదీప్ కుమార్.సిహెచ్ఓ ది భరత్,మేనేజర్ అనిల్ కుమార్,వైభవ అసిస్టెంట్ క్వాలిటీ మేనేజర్ డాక్టర్ రూప ఎంఎల్ హెచ్ పి,పుష్పవతి,సుప్రవేజర్,మిట్ట శ్రీనివాస్ హెల్త్ అసిస్టెంట్,ఏఎన్ఎంలు శోభరాజ్ సరూప.ఆశ వర్కర్లు రాజేశ్వరి,లక్ష్మీ,నీల తదితరులు పాల్గొన్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

 హనుమకొండ జిల్లా కాజీపేట ఆర్ఓబి నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్  స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. 

గురువారం కాజిపేట ఫాతిమా నగర్ సమీపంలో కొనసాగుతున్న  ఆర్ఓబి నిర్మాణ పనుల పురోగతిని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. 

ఇప్పటివరకు  పూర్తయిన ఆర్ఓబి నిర్మాణ పనులను, ఇంకా పూర్తి చేయాల్సిన పనులను గురించి ఆర్ అండ్ బి  శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ బాబును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 72 మీటర్ల బోస్ట్రింగ్ గడ్డర్స్ ఒకవైపు పూర్తయిందని, మరొకవైపు పనులు పురోగతిలో ఉన్నాయని ఈఈ సురేష్ బాబు కలెక్టర్ కు వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఆర్ఓబి పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. ఆర్ఓబి నిర్మాణ పనులు పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. 

కలెక్టర్ వెంట  హనుమకొండ ఆర్డీవో  రాథోడ్ రమేష్, కాజీపేట తహసీల్దార్ భావు సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

వరంగల్ బల్దియా పరిధి లోని అనధికారిక లే ఔట్ లను గుర్తించి తొలగించుటకు చర్యలు తీసుకోవాలని  నగర మేయర్  గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. 

బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయం లోని మేయర్ చాంబర్ లో టౌన్ ప్లానింగ్ అధికారులతో  జరిగిన సమావేశంలో మేయర్   సమర్థవంతంగా నిర్వహించుటకు  అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో  అనధికారిక లే ఔట్ లు ప్లాట్ లను కొనుగోలు చేయకూడదని, వీటి పట్ల ప్రజల్లో చైతన్యం  కలిగించడానికి టౌన్ ప్లానింగ్ విభాగం  వివిధ సామాజిక మాధ్యమాలు కరపత్రాలు ఫ్లెక్సీ ల ద్వారా అవగాహన కలిగించాలని మేయర్ అధికారులను ఆదేశించారు. 

మున్సిపాలిటీ కి చెందిన ఓపెన్ ప్లాట్లు, కాంపౌండ్ వాల్ లేని మున్సిపల్ స్థలాలు, పార్కు లు  బల్దియాకు చెందిన ప్రాపర్టీలని సూచించే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రీన్ ఏరియాకు సంబంధించిన ప్రాపర్టీ ని ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షించాలని, బల్దియా వ్యాప్తంగా  క్షేత్ర స్థాయి లో టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది అనధికార లేఅవుట్ లు, ముందస్తుగా  గుర్తించాలని, వర్షాకాలం నేపద్యం లో నగర వ్యాప్తం గా ఉన్న శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి వారికి నోటీసులు అందించి ప్రాణ, ధన నష్టం కలుగ కుండా ఖాళీ చేయించాలని,  అపార్ట్మెంట్ లలో  గల సెల్లార్ ప్రాంతాల్లో విద్యుత్ ఉపకరణాలు లేకుండా చూడాలని ఈ సందర్భంగా మేయర్ అధికారులకు సూచించారు.

 కార్యక్రమంలో ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ అసిస్టెంట్ సిటీ ప్లానర్లు శ్రీనివాస్ రెడ్డి రజిత యెర్షాద్ ప్రశాంత్ తోపాటు టిపిఎస్ లు టి పి బి ఓ లు తదితరులు పాల్గొన్నారు.


మార్కెట్ లో వ్యాపారాలు నిర్వహించేలా చర్యలు చేపట్టండి: కమిషనర్ 

ఖాజీపేట మార్కెట్ లో వ్యాపారాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్  అధికారులను ఆదేశించారు.బుధవారం కమిషనర్ నగర పరిధి లోని ఖాజీపేట మార్కెట్ బాల సముద్రం ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి లో సందర్శించి సమర్థవంతం గా నిర్వహించుటకు అధికారులకు తగు సూచనలు చేశారు.ఈ సందర్భం గా కమిషనర్ మాట్లాడుతూ... రోడ్ల మీద వ్యాపారాలు నిర్వహించడం వల్ల వినియోగదారులు మార్కెట్ లోకి రావడంలేదని, కాజీపేట మార్కెట్ కు సంబంధించి  స్థానిక  మార్కెట్ దారులు  ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రోడ్డు మీద  కూరగాయలు అమ్మే  వారిని మార్కెట్ లో వ్యాపారాలు  నిర్వహించుకునేలా చూడాలని  ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్ మార్కెట్ లు  ఓపెన్ చేసి మటన్ చికెన్  విక్రయించే దుకాణాలను అక్కడే వ్యాపారాలు నిర్వహించేలా చూస్తూ  మార్కెట్ ను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.  కూరగాయల మార్కెట్ యందు  పోలీసు, పట్టణ ప్రణాళిక విభాగం  ఇంజనీరింగ్ విభాగాల  సమన్వయంతో  స్ట్రీమ్ లైన్ చేసి వీధి వ్యాపారులకు  ఉపాధి అందేలా చూడాలని, స్లాటర్ హౌస్ చిన్నగా ఉందని  ఇందుకు కావలసిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని అవకాశం ఉంటే నూతన వదశాల ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

 బాలసముద్రంలోని   కోకో పిట్ యూనిట్ ను పరిశీలించిన కమిషనర్  నిర్వహణ బాగుందని, కొబ్బరి బొండాల వ్యర్థాలు ఎక్కువగా పేరుకు పోయి ఉన్నాయని, వేగవంతంగా ప్రాసెసింగ్ చేసి నిల్వ లేకుండా చూడాలని అన్నారు. ఈ యూనిట్ కార్పొరేషన్ కు మోడల్ గా  నిలుస్తుందని తెలిపారు. వర్మీ కంపోస్ట్ యూనిట్ చాలా బాగుందని  దీనిని మరింత బలోపేతం చేయడానికి మరో షెడ్ ను ఏర్పాటు  చేసి సామర్థ్యాన్ని పెంచాలని ఈ ఈ నీ ఆదేశించారు. బయో  మిథనైజేషన్  ప్లాంటుకు మరమత్తులు చేపట్టి పునరుద్ధరించాలని అలా కాని పక్షంలో ఇదే ప్రాంతం లో నూతన  బయో మిథనైజేషన్  ప్లాంటు ఏర్పాటు కు చర్యలు చేపట్టాలని విండ్రో కాంపోస్టు యూనిట్ ఉన్న ప్రాంతంలో నీరు చేరుతుందని దానిని అరికట్టడానికి అక్కడ మొరం వేసి  అరికట్టి బలోపేతం చేయాలని కమిషనర్ అన్నారు.కార్యక్రమంలో సి.ఎం.హెచ్.ఓ డా. రాజారెడ్డి,   వెటర్నరీ వైద్యులు డాక్టర్ గోపాలరావు, ఈ ఈ రవి కుమార్, డి ఈ  సారంగం ఏ ఈ లు రాగి శ్రీకాంత్ మేనక సానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్, వావ్ ప్రతినిధి పవన్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /

మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

వరంగల్ సూపర్ స్పెషాలిటీ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి ఆయా క్లినికల్ విభాగాల్లో వసతుల కేటాయింపునకు సంబంధించిన వివరాలతో కూడిన సూక్ష్మ ప్రణాళిక నివేదికను 15 రోజుల్లో సమర్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వైద్య అధికారులను ఆదేశించారు. 

బుధవారం వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లోని

సమావేశపు హాలులో

వైద్యాధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి కలెక్టర్  సమావేశమై

నిర్మాణ పనులను, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ రేడియాలజీ పాథాలజీ ఫోరెన్సిక్,  ఆనిష్టేషియా బయో కెమిస్ట్రీ ఫారెన్సీక్ మెడిసిన్,  తదితర  క్లినికల్ విభాగాలకు  భవనాలలో కేటాయించిన అంతస్తుల వారిగా గదులు, ఇంకను ఇతర విభాగాల ఏర్పాటు కొరకు కావలసిన గదులు, సంబంధిత క్లినికల్ విభాగాల కు అవసరమగు మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై చర్చించారు.

అనంతరం సూపర్ స్పెషాలిటీ భవనంలో ప్రాథమికంగా కేటాయించిన ఆసుపత్రిలోని వివిధ  అంతస్తులలో వివిధ విభాగాల వైద్యాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలెక్టర్ క్షేత్ర స్థాయిలో అంతస్తుల వారిగా ఆయా క్లినికల్ విభాగాలకు కేటాయించిన గదులను పరిశీలించినారు.త్వరగా సూక్ష్మ ప్రణాళికను సిద్ధం చేసినట్లయితే ఆయా శాఖలకు కేటాయించాల్సిన వనరులు, వసతులు కల్పించేందుకు వీలవుతుందన్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న వివిధ పరికరాలను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాలన్నారు. దీనికితోడుగా అవసరమగు  కొత్త పరికరాలు సంబంధిత శాఖ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.  సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏ అంతస్తులో ఏయే విభాగాల్లో  వసతులు ఉండాలో ఆ సూక్ష్మ ప్రణాళికలో ఉండాలన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నివేదించే సూక్ష్మ ప్రణాళిక గురించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఎంజిఎం సుపరింటెండెంట్ కిశోర్,  ఎల్ అండ్ టి  అధికారి శరవరన్, జిల్లా ఆర్ అండ్ బి. అధికారి రాజేందర్, టీఎస్ ఎంఐడిసి డీఈ, ఆర్ఎంవోలు, వివిధ విభాగాల వైద్య శాఖాధిపతులు తదితరులు పాల్గొన్నారు.


కళాశాలలో  మౌలిక వసతుల కల్పించాలి: కలెక్టర్


గీసుగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరమ్మతులు, మౌలిక సదుపాయాల  కల్పన పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని  కలెక్టర్  ఆదేశించారు.బుధవారం గీసుకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ డాక్టర్ సత్య శారద సందర్శించి కళాశాలలో విద్యార్థుల సౌకర్యార్థం కావలసిన   మౌలిక సదుపాయాలు, చేపట్టుటకు

ప్రతిపాదించిన మరమత్తులను పరిశీలించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా   మంచి వాతావరణంలో విద్య బోధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల మరమ్మతులకు రూ.1.36 కోట్ల నిధులు మంజూరు కాగా,  అందులో గీసుగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 8.2 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు, ఆయా పనులను చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీధర్ సుమన్, టిజీ ఈడబ్ల్యూఐడిసి అసిస్టెంట్ ఇంజనీర్ మురళీకృష్ణ,  తహసిల్దార్ రియాజోద్దీన్ ప్రిన్సిపల్ శోభా దేవి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 

ఉమ్మడి వరంగల్;

గత 34 సంవత్సరాలుగా పోలీస్‌ శాఖలో ఉత్తమ సేవలందిస్తున్న భూపాలపల్లి అడిషనల్  ఎస్పీ అంగోత్ నరేష్ కుమార్  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అందించే అతి ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు.

పోలీసు శాఖలో 1991లో  ఎస్సై గా  ఎoపికయిన నరేష్ కుమార్  అంచలంచెలుగా ఎదిగారు. 2006లో సీఐగా పదోన్నతి పొందారు. 2017లో డీఎస్పీగా  ప్రమోషన్ పొంది, మహబూబాబాద్, మామునూర్ ఏసీపీ గా విధులు నిర్వర్తించారు. 2023 లో అడిషనల్ ఎస్పీ గా పదోన్నతి పొంది, ఖమ్మం పోలీసు కమిషనరేట్ లో  అడిషనల్. డీసీపీగా విధులు నిర్వర్తించారు, తాజాగా భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ గా విధులు నిర్వహిస్తున్నారు. సమర్థవంతమైన ఇన్వెస్టిగేషన్ తో నిందితులకు జీవిత ఖైదు పడే విధంగా కృషి చేయడంతో నరేష్ కుమార్ ని  ప్రభుత్వం ఈ పథకానికి ఎంపిక చేసింది.

 ఇంతకు ముందు నరేష్ కుమార్  సేవా పథకం, కఠిన సేవా పథకంతో పాటు, ప్రెసిడెంట్ గ్యాలoటరీ మెడల్ ను అందుకున్నారు. తాజాగా అతి ఉత్కృష్ట సేవా పథకానికి 

 ఎంపికైన అదనపు ఎస్పీ నరేష్ కుమార్ గారిని జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే   అభినందించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 

ఉమ్మడి వరంగల్;

వరంగల్ బల్దియా వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు.

మంగళ వారం బల్దియా ప్రధాన కార్యాలయం లోని మేయర్ ఛాంబర్ లో 

హార్టికల్చర్ మెప్మా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం లో మేయర్ పాల్గొని మాట్లాడారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మెప్మా సి ఓ లు, ఆర్ పి లు డివిజన్ కార్పొరేటర్ ల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి మొక్కలు అందజేయాలని, బల్దియా పరిధిలోగల నియోజక వర్గాల్లో టి ఎల్ ఎఫ్ ల ద్వారా ఇందిర మహిళా సంబురాలు ప్రతి నియోజక వర్గాల్లో జరగాలని, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంతో పాటు ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరిన ఎస్ హెచ్ జీ మహిళల విజయ గాధలను స్వయంగా వారే తెలియజేయాలని అన్నారు.

ప్రతి ఇంటికి అర్బన్ ప్రాంతంలో ఐతే 4 మొక్కలు, విలీన గ్రామాలలో ఐతే 6 మొక్కలను అందజేయడం జరుగుతుందని, అట్టి మొక్కలను నాటి సంరక్షించేలా చూడాలని అన్నారు. ఏవేన్యూ ప్లాంటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని నగర పరిధి లోని కుంటలు, నీటి కొలను చుట్టూ ఈత చెట్లు నాటాలని, వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా బల్దియా పరిధి లో 15 లక్షల మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని, ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకునేలా చూడాలని మేయర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, హెచ్ ఓ లు రమేష్, లక్ష్మారెడ్డి టిఎంసి రమేష్, సి ఓ లు ప్రవీణ్, సకినాల రమేష్ రాజ్ కుమార్, శ్రీలత రజిత శ్రీనివాసులు గుండు రమ సఫియా హరికల్టర్ అసిస్టెంట్ లు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదాములను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం సందర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. స్ట్రాంగ్ రూములకు వేసి ఉన్న సీల్ లను, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘా, పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ గురించి ఎన్నికల విభాగం అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రసాదరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.