మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల మానవ హక్కుల సంఘం అధ్యక్షులు పవన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని టేక్మాల్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మానవ హక్కుల సంఘం మండల అధ్యక్షులు పవన్ అన్నారు. ఎక్కడ కూడా ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా మండల అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు వర్షాలు వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చిన ఎదుర్కొనేందుకు ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని తెలిపారు ప్రజలు తక్కువ ప్రాంతాల నుంచి పర్యవేక్షణలో ఉండి ఎలాంటి విపత్తులు ఎదురైతే అధికారులు లేదా స్థానిక నాయకులకు వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు నీటిలో ఉండే వంతెనలు కట్టలు దాటవద్దు జలపాతాలు వాగులు నదులు చెరువులకు వెళ్ళవద్దు అని తెలిపారు పురాతన భవనాలకు దగ్గరగా ఉండరాదు అని అన్నారు చేపల వేటకు వెళ్లేవారు వర్షాలు ఆగే వరకు ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు

Post A Comment: