ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

 మహాలక్ష్మి పథకం తో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని హనుమకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) రమేష్ రాథోడ్ అన్నారు. మహాలక్ష్మి పథకం డిసెంబర్ 9, 2023 నుండి అమలై నేటి వరకు 200 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన సందర్భంగా స్థానిక హనుమకొండ బస్టాండ్ లో ఈరోజు ఆర్టీసీ వరంగల్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ కేశరాజు భానుకిరణ్ ఏర్పాటు చేసిన మహిళా అభినందన సభలో హనుమకొండ ఆర్డిఓ రమేష్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై ఉపన్యసించారు . ఈ సందర్భంగా రమేష్ రాథోడ్ మాట్లాడుతూ 200 కోట్ల మహిళా ప్రయాణికులను వారి గమ్మన స్థానానికి చేరవేర్చి రూపాయలు 6680 కోట్ల ప్రయాణం చార్జీలను ఆదా చేసినందుకు రాష్ట్ర మహిళలందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకప్పుడు ఆర్టీసీ నష్టాలు ఉండేదని కానీ నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో నష్టాలు పోయి లాభాల బాటలో కి వచ్చిందని అన్నారు. ప్రతి ఒక్క బస్సులో 70 శాతం మహిళా ప్రయాణికులు ఉంటే కేవలం 30 శాతం మాత్రమే పురుష ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని అన్నారు. మహిళలకు ఎన్నో పనులు ఉంటాయని ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు, కాలేజీలకు వాళ్లు మార్కెట్కు వచ్చేవాళ్ళు హాస్పిటల్లో పనిచేసేవాళ్లు, షాపుల్లో పనిచేసే వాళ్లు ఇంకా అనేక రంగాల్లో పనిచేసే వాళ్లు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఈ పథకం వల్ల మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారని ప్రయాణ ఖర్చులు పూర్తిగా ఉచితం అవడంతో వారి జీవనశైలి లో మార్పు వచ్చిందని అన్నారు. ఆర్టిసి కూడా అనేక డిపో లు నష్టాలు చవి చూశాయని ఈ పథకం వల్ల ఆర్టీసీ లాభాల బాట పట్టిందని అన్నారు. అంతేకాక ఈ పథకం వల్ల ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పూర్తిగా తగ్గిపోయిందని అన్నారు. ఈ పథకాన్ని రాష్ట్రంలోని మహిళలందరూ ఉపయోగించుకొని ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటున్నాను. అని అన్నారు. కార్యక్రమం ఉద్దేశించి డిప్యూటీ రీజినల్ మేనేజర్ కేశరాజు భాను కిరణ్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా పెరిగిన ప్రయాణికుల రద్దీ దృశ్య 112 ఎలక్ట్రికల్ బస్సులను వరంగల్ టూ డిపోలో ప్రవేశపెట్టామని 40 కొత్త డీజిల్ బస్సులను కూడా ప్రవేశపెట్టాలని అన్నారు ఏ టువంటి కంప్లైంట్స్ లేకుండా మహిళల రద్దీకణుగుణంగా ఈ బస్సులను ప్రవేశపెట్టామని అన్నారు దేశంలోనే కర్ణాటక రాష్ట్రం తర్వాత మన రాష్ట్రంలో ఈ పథకం ప్రవేశపెట్టిందని అలాగే మన రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఈ పథకం అమలవుతుందని అన్నారు డ్రైవర్ కండక్టర్లు బస్సులో ఎంతమంది ఎక్కిన ఇసుక్కోకుండా శ్రమ అనుకోకుండా పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తూ ప్రయాణికులందరిని క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుస్తున్న చేస్తున్నారని అన్నారు. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు అలాగే ఈ పథకానికి సహకరిస్తున్న మహిళ లందరికీ టీజీఎస్ఆర్టిసి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ మహాలక్ష్మి పథకం వరంగల్ రీజియన్ లో 15 కోట్ల 43 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలకు కాంపిటీషన్ పెట్టామని వారికి ఆర్టీసీ తరఫున అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఉపన్యాస పోటీలు, ఎస్సే రైటింగ్ పోటీలు పెట్టడం జరిగింది అని అన్నారు. ఈ పోటీలో గెలుపొందిన వారందరికీ ఆర్డిఓ రమేష్ రాథోడ్ చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. ఈ పోటీల్లో ఎస్సే రైటింగ్ లో ఆదిత్య 9th క్లాస్, ఎస్. జైవీర్ 8 th క్లాస్, కే సారిక డిగ్రీ థర్డ్ ఇయర్. బి సరిత బీఎస్సీ సెకండ్ ఇయర్, బి సరస్వతి బీకాం లు బహుమతులు గెలుచుకున్నారు అలాగే రెగ్యులర్ ప్రయాణికులకు సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో వరంగల్ 1 డిపో మేనేజర్ పి. అర్పిత , అసిస్టెంట్ మేనేజర్ సి.హెచ్. సంతోష్ కుమార్,

 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎం) అమల, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కీర్తి, ఆర్టీసీ సిబ్బంది, మరియు ప్రయాణికులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: