ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న మరో 3 రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలెవ్వరూ లోతట్టు ప్రాంతాలను, చెరువులు, కుంటలను గోదావరి, మానేరు నదులను చూడడానికి వెళ్లకూడదని, వెళితే ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 87126 58129 ను సంప్రదించవలసిందిగా సూచించారు.
జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలు వరద ప్రభావం ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ తెలిపారు.భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు కింది సూచనలు పాటించాలని ఎస్పీ కోరారు.అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు. ప్రమాద కారణాల దృష్ట్యా చెరువులు, కుంటలను చూడటానికి వెళ్లరాదు. రైతులు పొలాలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలి. విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను కానీ చేతులతో తాకకకూడదు. నీరు నిలువ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గర నుండి వెళ్లరాదు. వాగులు వంకలు బ్రిడ్జ్ లపై నుండి పొంగి, ప్రవహించే సమయంలో దాటాడానికి ప్రయత్నించరాదు. పాడైన పాత భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల ప్రక్కన నివాసం ఉండరాదు.

Post A Comment: