ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

 హనుమకొండ జిల్లా లో వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలని  హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. 

బుధవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని ఉన్నతశ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా ఓపి విభాగాన్ని పరిశీలించి అక్కడ ఉన్న పేషెంట్స్ తో కలెక్టర్ మాట్లాడి ఆరోగ్య కేంద్రం ద్వారా అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలోని ఫార్మసీని సందర్శించి మందుల నిల్వలను  అడిగి తెలుసుకున్నారు. ఈ-ఔషధి పోర్టల్ లో  ఫార్మసికి కావాల్సిన మందులను  ఎలా ఇండెంట్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఉప కేంద్రాలకు మందులను ఏ విధంగా అందిస్తున్నారనే వివరాలను వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎన్సిడి కార్యక్రమంలో బీపీ,షుగర్ లాంటివి ఏ విధంగా స్క్రీనింగ్ చేస్తున్నారని, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు మందులను ఏ విధంగా అందుతున్నాయి అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తొలగింపు ప్రతిపాదనలో ఉన్న  ఆరోగ్య కేంద్రంలోని పేషంట్ వార్డ్, థియేటర్లను కలెక్టర్ పరిశీలించారు. అదేవిధంగా ఆరోగ్య కేంద్రంలోని ల్యాబ్ ను పరిశీలించి  నమూనాలను ఏ విధంగా సేకరిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. 

 అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ  ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రమైన వాతావరణము ఉండాలని, నిరంతరం పరిశుభ్రతను పాటించాలన్నారు. అవసరమైన మందులు అన్ని ఫార్మసీలో అందుబాటులో ఉంచాలన్నారు. 

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, యుపిహెచ్సి  వైద్యాధికారి డాక్టర్ భార్గవ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: