ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;
గత 34 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో ఉత్తమ సేవలందిస్తున్న భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ అంగోత్ నరేష్ కుమార్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అందించే అతి ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు.
పోలీసు శాఖలో 1991లో ఎస్సై గా ఎoపికయిన నరేష్ కుమార్ అంచలంచెలుగా ఎదిగారు. 2006లో సీఐగా పదోన్నతి పొందారు. 2017లో డీఎస్పీగా ప్రమోషన్ పొంది, మహబూబాబాద్, మామునూర్ ఏసీపీ గా విధులు నిర్వర్తించారు. 2023 లో అడిషనల్ ఎస్పీ గా పదోన్నతి పొంది, ఖమ్మం పోలీసు కమిషనరేట్ లో అడిషనల్. డీసీపీగా విధులు నిర్వర్తించారు, తాజాగా భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ గా విధులు నిర్వహిస్తున్నారు. సమర్థవంతమైన ఇన్వెస్టిగేషన్ తో నిందితులకు జీవిత ఖైదు పడే విధంగా కృషి చేయడంతో నరేష్ కుమార్ ని ప్రభుత్వం ఈ పథకానికి ఎంపిక చేసింది.
ఇంతకు ముందు నరేష్ కుమార్ సేవా పథకం, కఠిన సేవా పథకంతో పాటు, ప్రెసిడెంట్ గ్యాలoటరీ మెడల్ ను అందుకున్నారు. తాజాగా అతి ఉత్కృష్ట సేవా పథకానికి
ఎంపికైన అదనపు ఎస్పీ నరేష్ కుమార్ గారిని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అభినందించారు.

Post A Comment: