ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /

మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

వరంగల్ సూపర్ స్పెషాలిటీ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి ఆయా క్లినికల్ విభాగాల్లో వసతుల కేటాయింపునకు సంబంధించిన వివరాలతో కూడిన సూక్ష్మ ప్రణాళిక నివేదికను 15 రోజుల్లో సమర్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వైద్య అధికారులను ఆదేశించారు. 

బుధవారం వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లోని

సమావేశపు హాలులో

వైద్యాధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి కలెక్టర్  సమావేశమై

నిర్మాణ పనులను, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ రేడియాలజీ పాథాలజీ ఫోరెన్సిక్,  ఆనిష్టేషియా బయో కెమిస్ట్రీ ఫారెన్సీక్ మెడిసిన్,  తదితర  క్లినికల్ విభాగాలకు  భవనాలలో కేటాయించిన అంతస్తుల వారిగా గదులు, ఇంకను ఇతర విభాగాల ఏర్పాటు కొరకు కావలసిన గదులు, సంబంధిత క్లినికల్ విభాగాల కు అవసరమగు మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై చర్చించారు.

అనంతరం సూపర్ స్పెషాలిటీ భవనంలో ప్రాథమికంగా కేటాయించిన ఆసుపత్రిలోని వివిధ  అంతస్తులలో వివిధ విభాగాల వైద్యాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలెక్టర్ క్షేత్ర స్థాయిలో అంతస్తుల వారిగా ఆయా క్లినికల్ విభాగాలకు కేటాయించిన గదులను పరిశీలించినారు.త్వరగా సూక్ష్మ ప్రణాళికను సిద్ధం చేసినట్లయితే ఆయా శాఖలకు కేటాయించాల్సిన వనరులు, వసతులు కల్పించేందుకు వీలవుతుందన్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న వివిధ పరికరాలను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాలన్నారు. దీనికితోడుగా అవసరమగు  కొత్త పరికరాలు సంబంధిత శాఖ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.  సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏ అంతస్తులో ఏయే విభాగాల్లో  వసతులు ఉండాలో ఆ సూక్ష్మ ప్రణాళికలో ఉండాలన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నివేదించే సూక్ష్మ ప్రణాళిక గురించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఎంజిఎం సుపరింటెండెంట్ కిశోర్,  ఎల్ అండ్ టి  అధికారి శరవరన్, జిల్లా ఆర్ అండ్ బి. అధికారి రాజేందర్, టీఎస్ ఎంఐడిసి డీఈ, ఆర్ఎంవోలు, వివిధ విభాగాల వైద్య శాఖాధిపతులు తదితరులు పాల్గొన్నారు.


కళాశాలలో  మౌలిక వసతుల కల్పించాలి: కలెక్టర్


గీసుగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరమ్మతులు, మౌలిక సదుపాయాల  కల్పన పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని  కలెక్టర్  ఆదేశించారు.బుధవారం గీసుకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ డాక్టర్ సత్య శారద సందర్శించి కళాశాలలో విద్యార్థుల సౌకర్యార్థం కావలసిన   మౌలిక సదుపాయాలు, చేపట్టుటకు

ప్రతిపాదించిన మరమత్తులను పరిశీలించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా   మంచి వాతావరణంలో విద్య బోధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల మరమ్మతులకు రూ.1.36 కోట్ల నిధులు మంజూరు కాగా,  అందులో గీసుగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 8.2 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు, ఆయా పనులను చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీధర్ సుమన్, టిజీ ఈడబ్ల్యూఐడిసి అసిస్టెంట్ ఇంజనీర్ మురళీకృష్ణ,  తహసిల్దార్ రియాజోద్దీన్ ప్రిన్సిపల్ శోభా దేవి తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: