ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదాములను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం సందర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. స్ట్రాంగ్ రూములకు వేసి ఉన్న సీల్ లను, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల నిఘా, పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ గురించి ఎన్నికల విభాగం అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రసాదరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Post A Comment: