సంగారెడ్డి జిల్లా చౌటకుర్ మండలం సుల్తాన్పూర్లో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి మద్యం మత్తులో కూమార్తెను తండ్రి లైంగికంగా వేధించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన భార్య భర్తను గొడ్డలితో నరికి చంపింది. మద్యానికి బానిసైన భర్త తరచూ వేధిస్తున్నట్లు తెలిసింది. అనంతరం తల్లీకుమార్తె పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post A Comment: