పెద్దపల్లి,గోదావరిఖ,ఏప్రిల్,26(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్)రామగుండం నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపపేతం చేసే దిశగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి ఆర్కె సాగర్ సూచనల మేరకు,రామగుండం బీఆర్ఎస్ పార్టీ యూత్ కోఆర్డినేటర్ సుద్దాల అనురాజ్ ను శుక్రవారం జనసేన పార్టీలొకి ఆహ్వానించారు,ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన ఆర్గనైసింగ్ కార్యదర్శి మంథని శ్రవణ్ ఆధ్వర్యంలో సుద్దాల అనురాజుతో పాటు యూత్ సభ్యులకు జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు,అనంతరం పార్టీ అధ్యక్షునికి నాయకులకు కృతజ్ఞతలు తెలిపాడు,ఈ సందర్భంగా అనురాజ్ మాట్లాడరు.రాబోయే రోజుల్లో జనసేనపార్టీని రామగుండం నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో పార్టీని ముందు తీసుకెళ్తూ సైనికుడిగా పనిచేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మోతే రవికాంత్,బండారి తిరుపతి,తుంగపల్లి కుమార్,బండారి సంతోష్,సాయి.తెగుట్ల మనోజ్,గూరాళ్ల మనోజ్,అతిశయి,శోభిత్,రోహిత్,వినయ్,రాజు,శివ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: