పెద్దపల్లి:మంథని:10:12:23:(మేడిగడ్డటీవీ న్యూస్)కాంగ్రెస్ పథకాలు గ్యారెంటీ కాదు కేసీఆరే గ్యారెంటీ,ఐదు పథకాల పేరుతో కర్ణాటక ప్రజలను మోసం చేసిండ్లు,ఐదేండ్లలో ఒక్కరికి సాయం చేయకుండా మళ్లా వస్తాండ్లు,మా అభివృధ్ది పనులు,మా సేవలు మీ కళ్ల ముందే ఉన్నయ్ గోదావరిఖని తరహాలో సుందిళ్లను అభివృధ్ది చేసి చూపిస్తా,మనది పేగు సంబంధం కనుకనే ఇంత ప్రేమ చూపిస్తాండ్లు మీ బిడ్డల భవిష్యత్ బాధ్యతలన్నీ నేనే తీసుకుంటా బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్,ఆరు గ్యారెంటీ పథకాలతో ఓట్ల కోసం కాంగ్రెస్సోళ్లు వస్తున్నారని,కాంగ్రెస్ పథకాలు గ్యారెంటీ కావని,ముఖ్యమంత్రి కేసీఆరే మనకు గ్యారెంటీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా శుక్రవారం రామగిరి మండలం సుందిళ్ల,ముస్త్యాల,పెద్దంపేట్,సింగిరెడ్డిపల్లి,చందనాపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లో బారీగా ప్రజలు తరలి వచ్చి స్వాగతం పలికారు.అనంతరం ఇంటింటికి తిరిగి ఆప్యాయంగా పలకరిస్తూ బీఆర్‌ఎస్ ఎన్నికల మేనీఫెస్టోతో పాటు తన సొంత మేనీఫెస్టోను వివరిస్తూ ఆశీర్వదించాలని కోరారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడరు,మంథని నియోజకవర్గంలో బీసీ బిడ్డగా మూడోసారి బీఆర్‌ఎస్‌పార్టీ ఎమ్మెల్యేగా నిలబడ్డానని,ఇప్పటి వరకు నియోజకవర్గంలో బీసీలు మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన చరిత్ర,లేదన్నారు.ఆనాడు ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించారని,ఎమ్మెల్యేగా తాను ఈ ప్రాంత అభివృధ్ది,ప్రజల సంక్షేమంతోపాటు అనేక సేవలు అందించానని గుర్తుచేశారు.ఒకవైపు ప్రభుత్వం అమలు చేసే పథకాలను అందించడంతో పాటు ఎంతో మందికి అన్నం పెట్టి ఆకలితీర్చానని,కళాశాలల్లో విద్యార్ధులకు మధ్యాహ్న బోజనం,అంబులెన్స్‌లు,చదువులుకు సాయం,ఆస్పత్రుల్లో వైద్యం చేయించానని,ఆర్థిక స్థోమతలేని ఆడబిడ్డల తల్లిదండ్రులకు బిడ్డ పెండ్లి బారం కావద్దని మేనమామ స్థానంలో నిలబడి సామూహిక వివాహాలు జరిపించానని చెప్పారు.ఎన్నికలు వస్తున్నాయంటేనే ఏదోమాయమాటలు చెప్పేందుకు వస్తుంటారని,ఈసారి ఆరుపథకాల పేరుతో వస్తున్నారని అన్నారు.గత కొద్ది నెలల క్రితం కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు పథకాల హమీ ఇచ్చిందని,ఎన్నికల్లో గెలిచి అదికారంలోకి వచ్చాక ఆ పథకాలను అమలుచేయడంలేదన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అదికారంలోకి వస్తే 24గంటలకరెంటు,రైతుబంధు,రైతు బీమా,ధరణిలను బంద్ చేయించే ఆలోచనలో కాంగ్రెస్‌పార్టీఉందని,ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర నాయకులు తమ మనస్సులో మాట చెప్పారని అన్నారు.గత ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే ఐదేండ్లలో ఒక్కరికి సాయంచేయలేదని,ఏదైనా సమస్య చెప్పుకుంటే మా ప్రభుత్వంలేదన్నోళ్లు ఈనాడు మళ్లీ ఓట్ల కోసం మనవద్దకే వస్తున్నారని ఆయన విమర్శించారు.ఐదేండ్లు ఏమీ చేయకుండా మళ్లా ఐదేండ్లు అధికారం ఉండాలనే ఆరాటంలో కాంగ్రెస్సోళ్లు ఉన్నారని,కేవలం నోట్ల సంచులతో ఓట్లను కొనేందుకు చూస్తున్నారని అన్నారు.కాంగ్రెస్ మాటలు నమ్మితే కర్ణాటక తరహాలో గోసపడక తప్పదన్నారు.తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తాము చేసిన అభివృద్ది,సేవలు మీ కళ్ల ముందే కన్పిస్తున్నాయని అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని సుందిళ్ల బ్యారేజీగా పిలుచుకుంటే సుందిళ్ల గ్రామానికి గుర్తింపు వచ్చిందని,అయితే ఇక్కడే పురాతణ ఆలయాన్ని అభివృధ్దిలోకి తీసుకువచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.ఇప్పటికే సుందిళ్ల గోదావరినది తీరంలో పుష్కరఘాట్ నిర్మించుకున్నామని,ఆలయాన్ని మరింత అభివృధ్ది చేసి గోదావరిఖని తరహాలో సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనన్నారు.ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ మంథని అభివృధ్దికి వేయి కోట్లు ప్రకటించారని,ఆ నిదుల్లో కొంతమేర సుందిళ్ల,ముస్త్యాల అభివృధ్దికి కేటాయిస్తానని హమీ ఇచ్చారు.తాను ఎప్పుడు ఈ మండలానికి వచ్చినా ప్రేమ ఆప్యాయతతో పలకరిస్తూ వస్తుంటారని,మనది పేగుబందమే కానీ ఓటు బంధం కాదన్నారు.తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒకవైపు ప్రభుత్వం అందించే పథకాలతో పాటు తాను సొంతంగా కొన్ని పథకాలను అమలు చేస్తానని,ముఖ్యంగా పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు,నిరుపేద విద్యార్దుల ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌లోరెండు హస్టల్‌లు ఏర్పాటు చేసి మీ బిడ్డల భవిష్యత్ బాధ్యతను తానే తీసుకుంటానని హమీ ఇచ్చారు.అదే విధంగా ఇండ్లులేని నిరుపేదలకు గృహలక్ష్మి పథకం ద్వారా మూడులక్షలతో పాటు తాను కొంత కలిపి ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయిస్తానని ఆయన భరోసా ఇచ్చారు.నిత్యం అందుబాటులో ఉంటూ మీకు సేవ చేసే అవకాశం కల్పించారని,మీరంతా ఆదరించి ఆశీర్వదించాలని కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో ఉమ్మడి కమాన్పూర్ మండల్ నాయకులు,నాయకురాలు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Post A Comment: