(పబ్లిక్ న్యూస్) ఆర్ సి రామగుండం నవంబరు 10
దీపావళి పండుగ తర్వాత బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, తిరిగి అధికారంలోకి రాగానే అమలు చేయనున్న మేనిఫెస్టో గురించి తమ డివిజన్, గ్రామంలో ఇంటింటికి, గడప గడపకు వివరించాలని రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కార్యకర్తలకు సూచించారు.
స్థానిక ప్రధాన చౌరస్తా సమీపంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన నామినేషన్ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన నామినేషన్ మహోత్సవ ఆశీర్వాద సభకు వేలాదిగా హాజరై, తనను ఆశీర్వదించి, మద్దతు తెలిపిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకైన పాత్ర పోషించిన తనపై 125 కేసులు నమోదు కాగా, అందులో 45 నాన్ బెయిలబుల్ కేసులేనన్నారు. 45 రోజులపాటు జైలు జీవితం గడిపానని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక తనపై ఉన్న కేసులన్నీ కొట్టివేశారన్నారు. తెలంగాణ రాష్ట్రమే గనుక సిద్ధించకపోతే తన జీవితమంతా కోర్టుల చుట్టూ, జైళ్ళ చుట్టూ తిరగడంతోనే గడిచిపోయేదన్నారు. ప్రజల పోరాట చైతన్యంతో, ఉద్యమస్ఫూర్తితో, కార్యాచరణతోనే రాష్ట్రం ఏర్పడగా తనపై ఉన్న కేసులన్నీ కొట్టివేశారన్నారు. 2021 లో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల సమయంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నవారు కోవిడ్ నిబంధనల ప్రకారం మాస్కులు ధరించలేదని ఇన్చార్జిగా ఉన్న తనపై హాలియా పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు, నాంపల్లి కోర్టులో పెండింగ్ లో ఉండడం మినహా మరే విధమైన నేరచరిత్ర తనకు లేదని, ఇతర కేసులు గాని తనపై లేవని, ఈ విషయం ఎన్నికల కమిషన్ కు తెలపడం జరిగిందని, తన బాధ్యతగా తనను నమ్మిన ప్రజలకు తెలపడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చానన్నారు. తనపై నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా గొప్ప అవకాశం ఇచ్చారని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. కారు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో మరోమారు గెలిపించాలని, తాను గెలిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానన్న కేటీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అదిక సంఖ్యలో జెడ్పిటిసి ఎంపీటీసీలు సర్పంచులు కార్పొరేటర్లు కార్యకర్తలు పాల్గొన్నారు

Post A Comment: