పెద్దపల్లి:మంథని,నవంబర్10,మేడిగడ్డటీవీన్యూస్,మంథని నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ ప్రచారంలో భాగంగా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు.గ్రామ ఎంట్రన్స్ లో అభ్యర్థి పుట్ట మధుకర్ ను పూలమాల శాలతో ఘనంగా సత్కరించీ స్వాగతం పలికారు.అక్కడనుండి నడుచుకుంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరిస్తూ,సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను వివరిస్తూ,ఈ సందర్భంగా వారు మాట్లాడారు,40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు ఏ విధంగా ఉండెనో ప్రజలు ఎంత అవస్థ పడ్డారోతెలుసు,తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా ఎమ్మెల్యేనైన నేను ఎంత అభివృద్ధి చేశానో మీ కళ్ళ ముందు కనిపించింది,ఈ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబును గెలిపిస్తే చీకటిగానే మిగిలింది మీరు చూస్తున్నారు,ఎవరైనా పోయి సమస్యలు అడుగుతే మా ప్రభుత్వము లేదు అంటూ ప్రతిపక్ష పాత్ర పోషించకుండా పట్నానికే పరిమితమై ఎన్నికలు రాగానే ప్రజలను మోసం చేయడానికి మళ్లీ వస్తున్నాడని గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ వాళ్లను ఆ నాయకున్ని ఏం చేసినావ్ అని నిలదీయాలని వాళ్ల మాయ మాటలకు మోసపోకుండా కర్ణాటకలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో అక్కడి ప్రజలు ఆగమైపోతున్నారని నిత్యం మనం వార్తలు చూస్తున్నాం అలాంటి పార్టీకి ఈసారి ఓటుతో వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు,సీఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని,తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పాటు నేను స్వతగా సహాయం చేస్తానని పై చదువుల కోసం పట్నం పోయే మీ పిల్లలకు ఉచిత హాస్టల్ సౌకర్యం ఏర్పాటు చేస్తానని తెలిపారు,జై తెలంగాణ,జై కేసీఆర్,జై జై పుట్ట మదన్న కారు గుర్తుకే మన ఓటు అంటూ మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలింగు,జెడ్పిటిసి మాదరబోయిన శారద,పార్టీ మండల అధ్యక్షుడు శంకేష్,రవీందర్,గ్రామశాఖ అధ్యక్షుడు బాసినేని సత్యనారాయణరావు,మాజీ సర్పంచ్ సుంకరి మాధవి,వార్డ్ నెంబర్ బీ వినోదరావు,నాయకులు,నాయకురాలు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు...

Post A Comment: