పెద్దపల్లి:రామగిరి:నవంబర్10(మేడిగడ్డటీవీన్యూస్)రాష్ట్రంలో వచ్చేది బిఆర్ఎస్ సర్కారే,మంథని నియోజవర్గ ప్రజల మద్దతు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంది మరొకమారు ఎమ్మెల్యేగా గెలిచి మరింత సేవచేస్తా ఆశీర్వదించండి.సుందిల్ల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మంథని నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ పాల్గొని.మాట్లాడరు,సుందిల్ల గ్రామానికి తనకు విడదీయలేని అనుబంధం ఉందని తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సుందిల్ల గ్రామ అభివృద్ధికి రెండు కోట్ల నిధులు మంజూరు చేశానని ప్రత్యేకంగా పుష్కర్ ఘాట్ ఏర్పాటు చేశాను,మీ కళ్ళముందు కనిపిస్తుంది,కాంగ్రెస్స్ వాళ్ళు మాటలు చెప్పడం తప్ప చేసింది ఏమీ లేదని వాళ్ల మాయ మాటలు మోసాలకు తగ్గట్టు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వపరంగా సొంతగా సహాయం చేస్తానని తెలిపారు.అంతకుముందు గజమాలతో ఘనంగా సన్మానించారు,ఈ ప్రచార కార్యక్రమంలో కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజాలింగు,రామగిరి జెడ్పిటిసి మేదరవెన శారద,రామగిరి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుంకేశి రవీందర్,సుందిళ్ల గ్రామ శాఖఅధ్యక్షుడు,మండల స్థాయి గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: