ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;మిషన్ 29 కార్యక్రమం లో భాగంగా అర్బన్ లో ఓటింగ్ శాతం పెరిగేలా అవసరమైన అన్ని చర్యలు అధికారులు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ లో మినీ కాన్ఫరెన్స్ హాల్ లో మిషన్ 29 కార్యక్రమం కింద వోటింగ్ పెంపు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు ను ఈనెల 30 వ తేదిన వినియోగించు కొనే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలి అని అన్నారు.
వందశాతం ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలనే సంకల్పంతో గ్రామాలు, అర్బన్ లో ప్రచారం చేపట్టాలని సూచించారు.పోలింగ్ కేంద్రం వరకు నడవలేని 80 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు వేసే విధంగా ఎన్నికల సంఘం ఈ సంవత్సరం ఉద్యోగుల తరహాలోనే వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించిందని అన్నారు.
గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం నమోదు తక్కువగా ఉండడంతో ఈసారి దాన్ని అధిగమించాలనే సంకల్పంతో ప్రచారాన్ని ముమ్మరం చేయాలి అని అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించడం జరిగింది అని, అంతే కాకుండా ప్రధాన కూడళ్లలో ఈవీఎం, వీవీప్యాట్లు నమూనాలతో కూడిన ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో బోర్డులను ఏర్పాటు చేశామని జిల్లా వ్యాప్తంగా వందశాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు విస్తృత ప్రచారం చేయాలి అని అన్నారు. ఓటరు జాబితాలో ఓటును చూసుకునేందుకు వినియోగించే ఓటర్స్ హెల్ప్‌లైన్ యాప్‌పై అవగాహన కల్పించాలని అన్నారు. ఓటర్ అవగాహన కొరకు గేటెడ్ కమ్యూనిటీ, మాల్స్, కాలనీ ల వద్ద వోటింగ్ పెంచడానికి అధికారులు శ్రద్ద వహించాలి అని అన్నారు. స్వీప్ కప్ ను నిర్వహించాలి అని అన్నారు. ఎన్నికల పై ఏదైనా ఫిర్యాదులు ఉంటే సి విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చని, కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1950కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని డబ్బు, మద్యం, ఏదైనా వస్తువుల పంపిణీ జరిగినా నేరు గా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో ట్రైనీ కలెక్టర్ శ్రద్ద శుక్ల, జిఎం ఇండస్ట్రీస్ హరిప్రసాద్, డిపిఓ జగదీశ్ జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Post A Comment: