ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

ఈవిఎం యంత్రాల కమీషనింగ్ కు ప్రణాళికాబద్ధంగా సిద్దం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. 

ఓటరు స్లిప్పుల పంపిణీ పై జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని,

సి విజల్ యాప్ పై విస్తృతంగా  ప్రచారం కల్పించాలన్నారు. 

రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు అవసరమైన అనుమతులను నిబంధనల మేరకు సకాలంలో అందించాలని సూచించారు.మంగళవారం

సాయంత్రం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర  ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. 

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ ఎన్నికల విధులను  నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. 

మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర  ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, 

ఎన్నికల ఎన్నికల పరిశీలకులు అజయ్ వి.నాయక్, దీపక్ మిశ్ర, ఆర్. బాలకృష్ణన్, రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ 

రాష్ట్ర  ప్రధాన ఎన్నికల అధికారి  వికాస్ రాజ్ మాట్లాడుతూ,  నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల సంఖ్య ఆధారంగా అవసరమైన మేర ఈవిఎం యంత్రాలు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని, అవసరమైతే అదనపు బ్యాలెట్ యూనిట్లను జిల్లాకు అందించడం జరుగుతుందని, నవంబర్ 18న రెండవ దశ ఈవీఎం యంత్రాల ర్యాండమైజేషన్ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 

పెండింగ్ ఓటరు నమోదు దరఖాస్తులను మూడు రోజుల వ్యవధిలో పరిష్కరించాలని అన్నారు.  ఎన్నికల తనిఖీలలో నగదు, బంగారం, ఇతర ఆభరణాలు జప్తు చేసే సమయంలో ఈ.ఎస్.ఎం.ఎస్ యాప్ లో క్షేత్రస్థాయిలో వెంటనే నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 

ఎన్నికల ప్రచారం సంబంధించి సమావేశాలు, సభలు నిర్వహించుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధుల, అభ్యర్థుల నుంచి  వచ్చే దరఖాస్తులకు ఎప్పటికప్పుడు సకాలంలో  అనుమతులు మంజూరు చేయాలని అన్నారు.  

జిల్లాలో ఓటర్ స్లిప్పులు త్వరగా ముద్రించి పంపిణీ చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని , ఓటరు స్లిప్పుల పంపిణీ నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రారంభించాలని, జిల్లాలో ఒక నోడల్ అధికారిని నియమించి ప్రతిరోజు ఓటర్ స్లిప్పుల పంపిణీ పై సమీక్ష నిర్వహించాలని అన్నారు. 

గతంలో తక్కువ పోలింగ్ నమోదైన పోలింగ్ కేంద్రాలపై అధిక దృష్టి సారించి పోలింగ్ శాతం పెరిగే విధంగా విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో

జిల్లా  కలెక్టర్,  జిల్లా ఎన్నికల అధికారి సిక్త పట్నాయక్ , అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, డిఆర్ఓ  గణేష్ ట్రైనీ కలెక్టర్ శ్రద్ద శుక్ల, డిఆర్డిఏ పిడి  శ్రీనివాస్ కుమార్ డిసిఓ  నాగేశ్వర్రావు ఎక్సయస్ అధికారి చంద్రశేఖర్ 

ఎన్నికల సూపర్ ఇండెంట్  ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: