ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్త పట్నాయక్ మంగళవారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని న్యూ రాయిపురా లో ఉన్న యునానీ హాస్పిటల్ లో ఉన్న 76, 77 పోలింగ్ కేంద్రాలను బ్రైని స్టార్స్ హై స్కూల్లో మార్చబదిందని ఇందులో 1839 ఓటర్లు ఉన్నారని తెలిపారు. పార్టీలు పంప్లెట్స్, పోస్టర్స్, కేబుల్ చానెల్స్ లో ప్రసారం చేసే వీడియో లు తప్పనిసరిగా ఎంసిఎంసీ కమిటీ ఆమోదం పొందాలని తెలిపారు. పోస్టర్స్ విధిగా ప్రింటర్స్ వివరాలు ముద్రించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్ జి, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, ఆర్.డి.ఓ. ఎల్.రమేష్, హనుమకొండ మండల తహశీల్దార్ కే.విజయ్ కుమార్, కాంగ్రెస్ నుండి ఈ.వి. శ్రీనివాస్, బి.జే.పి నుండి అమరేందర్ రెడ్డి, బి.అర్.ఎస్ నుండి రాంప్రసాద్, టి.డి.పి నుండి కుసుమ శ్యామ్ సుందర్, వై.ఎస్.అర్. టి.పి నుండి రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: