పెద్దపల్లి:మంథని:7:11:23:(మేడిగడ్డటీవీన్యూస్.ఛానల్):మంథని ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు బీఆర్‌ఎస్ పార్టీ చరిత్ర మీ కళ్ల ముందే కన్పిస్తది ఆనాడు తెలంగాణాను ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీనే దళారులను పోషించడానికే కాంగ్రెస్సోళ్లు ధరణి వద్దంటాండ్లు పని చేసే శక్తి సామర్థ్యం ఉన్న నాయకుడు పుట్ట మధూకర్,ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్‌ను బారీ మెజార్టీతో గెలిపించుకుంటే మంథని అభివృధ్దికి వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి కేటాయిస్తానని,ఆ నిధులతో మంథనిని అన్ని విధాలుగా అభివృధ్ది చేసుకుందామని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత,సీఎం కేసీఆర్ హమీ ఇచ్చారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా మంగళవారం మంథనిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.పుట్ట మధును బారీ మెజార్టీతో గెలిపించుకుంటే ఒక్క రోజంతా మంథనిలోనే ఉంటానని,అధికారులు,ప్రజాప్రతినిధులతో సమీక్ష చేసి మంథనిని తీర్చిదిద్దుకునేలా ప్రణాళికలు చేద్దామన్నారు.మంథని దరద్రం పోగేట్టే బాద్యత తనదని,పుట్ట మధును గెలిపించే బాధ్యత మంథని ప్రజలదేనని ఆయన అన్నారు.బీసీలకు రాజకీయ అవకాశాలు ఇవ్వడంలేదని ఆందోళనలు చేస్తారని,కానీ మంథనిలో బీసీ బిడ్డకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.బీసీ ఎస్సీఎస్టీ బలహీనవర్గాలన్నీ ఐక్యతతో బీసీ బిడ్డ గెలుపుకు కృషి చేయాలని,పుట్ట మధూకర్‌ను కాపాడుకోవాలని కెసిఆర్ పిలుపునిచ్చారు.ఎన్నికలు రాగానే ప్రజలు ఆగమాగమై పోతారని, ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థి,అభ్యర్థి వెనుక ఉండే పార్టీ చరిత్రపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు.ఈనాడు ప్రజా స్వామిక వ్యవస్థలో రాజకీయ పరిణితి లేదని,ఎన్నికలు వచ్చాయంటే ఆగమై ఆలోచన చేయకుండా ఓట్లు వేస్తున్నారని అన్నారు.వజ్రాయుధంలాంటి ఓటును సక్రమంగా వినియోగించుకుంటే అది మన తలరాతను మారుస్తుందని,ఆలోచించకుండా ఓటు వేయడంతోనే నాయకులు గెలుస్తున్నారే కానీ ప్రజలు గెలుస్తలేరన్నారు.రాజకీయ పరిణితి చెంది ఆలోచనతో ఓట్లు వేస్తే తప్పకుండా ప్రజలు గెలుస్తారని ఆయన అన్నారు.ఓటు వేసే ముందు పది మందితో చర్చించాలని,పార్టీకి అధికారం ఇస్తే ఏం చేసిందని ఆలోచించాలని అన్నారు.ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు గెలుస్తారని,ఆ పార్టీ ప్రభుత్వం అదికారంలో వస్తుందని,సరైన ప్రభుత్వం రాకపోతే ప్రజలు గోస పడకతప్పదన్నారు.బీఆర్‌ఎస్ పార్టీ చరిత్ర మీ కళ్ల ముందే ఉందని,ఆనాడు తెలంగాణ కోసం ప్రజల ఆకాంక్ష కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని ప్రజల అభీష్టం మేరకు బాధ్యత తీసుకుని పదేండ్లుగా సుపరిపాలన అందిస్తున్నామని ఆయన అన్నారు.పచ్చగా ఉన్న తెలంగాణాను చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతుందని,ఆనాడు ప్రజల ఇస్టానికి వ్యతిరేకంగా తెలంగాణాను ఆంధ్రాలో విలీనం చేసింది కాంగ్రెస పార్టీ కాదా అని అన్నారు.అటుతర్వాత 58ఏండ్ల పాటు తెలంగాణ ప్రాంత ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారని,తాగు,సాగునీరు,కరెంటు ఉపాధి అవకాశాలు లేక ఊర్లు వదిలి ఉపాధి కోసం వలసలు పోయిన సందర్బాలు అనేకం ఉన్నాయన్నారు.పిడికెడు మందితో బయలుదేరితే ఉప్పెనలా ప్రజలు కదిలారని,ఉద్యమాన్ని చూసి దిగివచ్చి తెలంగాణ ఇచ్చేందుకు సిద్దపడ్డారన్నారు.అటుతర్వాత కూడా కాంగ్రెస్ ఢిల్లీ గద్దెనెక్కి తెలంగాణ ఇచ్చేందుకు వెనుకడుగు వేసిందని,ఈ క్రమంలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడోనని ఉద్యమం చేస్తే కాంగ్రెస్ దిగి వచ్చి తెలంగాణ ఇచ్చిందన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రజల సంక్షేమ బాధ్యతలు తీసుకున్న బీఆర్‌ఎస్ సర్కార్ పదేండ్లుగా అనేక సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతోందన్నారు.అనేక ఏండ్లు మంథని ప్రాంతాన్ని పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు,ఇక్కడి పాలకులు ఏం అభివృధ్ది చేయలేదని,ఆనాటి పీవీ నర్సింగరావు హయాంలో మొదలుపెట్టిన రింగ్‌రోడ్డును ఈనాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పూర్తి చేసిన ఘనత పుట్ట మధూకర్‌దేనన్నారు.మంథని ప్రాంత అభివృధ్ది కోసం నిరంతరం కృషిచేసిన నాయకుడు పుట్ట మధూకర్ అని,తన నియోజకవర్గం మారుమూల ప్రాంతమని,వెనుకబాటుకు గురైందని అభివృద్దికి సహకరించాలని బ్రతిమాలి నిధులు తీసుకువచ్చాడని,పంకెన పలిమెలలాంటి ప్రాంతాలకు అభివృధ్దిబాటలు పడ్డాయంటే పుట్ట మధూ కృషి అని ఆయన కొనియాడారు.ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ మనస్సుల్లోని మాటలు బయటపెడుతున్నారని,ఒకర రైతుబంధు వద్దంటే,మరొకరు 24గంటల కరెంటు అవసరంలేదు మూడు గంటలు చాలని,మరో నాయకుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామంటున్నారని ఆయన అన్నారు.రైతులు గౌరవంగా బతుకాలనే ఆలోచనతోనే అనేక పథకాలు అమలు చేస్తుంటే వాటిని రద్దు చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు.ఒకప్పుడు కో ఆపరేటివ్ బ్యాంకుల్లో రైతు అప్పు తీసుకుని చెల్లించకుంటే తలుపులు పీక్కపోయిన సంఘటనలు మర్చిపోలేదన్నారు.రైతు భూమిపై పూర్తిస్థాయి హక్కు కల్పిస్తూ ధరణికి రూపకల్పన చేస్తే దాన్ని రద్దు చేయాలని చూస్తున్నారని,కేవలం దళారి వ్యవస్థను పెంచిపోషించాలని కాంగ్రెస్‌పార్టీ చూస్తుందన్నారు.ధరణి రద్దు చేస్తే ఎవరి భూమిని ఎవరు పట్టా చేయించుకుంటారో తెలియని,రైతుబంధు,రైతుబీమాలాంటి పథకాలను బంద్ చేస్తారని ఆయన వివరించారు.కాంగ్రెస్ భ్రమలోపడితే మన బతుకులు ఆగమైపోతాయని ప్రజలు గమనించాలన్నారు.గత ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధును దూరం చేసుకున్న ప్రజలు చైతన్యం చెందారని,ప్రజల మధ్యలో ఉండే నాయకుడిని గెలిపించుకోవాలన్నారు.హైదరాబాద్‌లో ఉండేటోళ్లకు ఓట్లేస్తే వాళ్లను కలిసేందుకు పట్టణాలకు పరుగులు పెట్టాలని అలాంటి నాయకులు మనకు ఎందుకనిఆలోచించాలన్నారు.ఏ పార్టీ అధికారంలో ఉంటదో ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించుకోవాలని,రాష్ట్రంలో రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని,ఇక్కడ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పుట్ట మధూకర్‌ను గెలిపించుకుంటే లాభం జరుగుతుందన్నారు.కాంగ్రెస్‌పార్టీకి ఢిల్లీలో బాస్‌లు ఉంటారని,వాళ్ల నిర్ణయం మేరకే ఇక్కడ పథకాలు అమలు అవుతాయని కానీ బీఆర్‌ఎస పార్టీకి ప్రజలే బాస్‌లని,ప్రజల అవసరాలను బట్టే ఇక్కడే నిర్ణయాలు ఉంటాయన్నారు.పార్టీ టికెట్లు అమ్ముకునే కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని,ఆ పార్టీకి డజన్ మంది సీఎంలు ఉంటారని,ఏడాదికోసారి సీఎం మారే పార్టీని తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.ఇక్కడే పుట్టా...ఈ మట్టిలో కలిసే వరకు ఉంటా...పుట్ట మధూకర్,ఎమ్మెల్యే అభ్యర్థి ఈ మట్టిలో పుట్టిన తాను ఈ మట్టిలో కలిసే వరకు ఇక్కడే ఉంటానని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ అన్నారు.మంగళవారం మంథనిలో జరిగిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ చీకటిలో మగ్గిపోయిన మంథని ప్రాంత ప్రజలకు వెలుగు అందించాలన్న ఆరాటంతో ముందుకు సాగుతున్నానని అన్నారు.ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి మంథని ప్రాంతంలో అనేక అభివృధ్ది పనులు చేశామని,పేదవాడి ఆకలి తీర్చామని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో మరోమారు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినా కాంగ్రెస్ అబద్దాలు నమ్మి దూరం చేశారని,మళ్లీ సీఎం కేసీఆర్ ముందుచూపుతో జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికై ప్రజా సేవలో ఉన్నానని అన్నారు.ఆనాడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంథని ప్రాంతంలోని అనేక మండలాలు,గ్రామాలకు అభివృద్ది బాటలు వేశానని,76ఏండ్ల స్వాతంత్య్రంలో నియోజకవర్గంలోని మోదేడు గ్రామానికి రోడ్డు వేయలేని దుస్థితి కాంగ్రెస్ పాలకులదేనని అన్నారు.ఈ క్రమంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మోదేడు గ్రామానికి ఏ ఎమ్మెల్యే పోలేదని,సరైన రోడ్లు లేవని అక్కడి ప్రజల స్థితిగతులను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే వెంటనే రోడ్డు నిర్మాణానికి రూ25కోట్లు మంజూరీ చేశారని అన్నారు.అలాగే ఓడేడ్,ఖమ్మంపల్లి మానేరు నదులపై వంతెనలు మంజూరీ చేశారన్నారు.నియోజకవర్గంలోనే మారుమూల గ్రామమైన పెద్దంపేట ప్రజలు వర్షాకాలంలో అనేక ఇబ్బందులు పడేవారని,పెద్దంపేట వాగు ఉప్పొంగితే బాహ్యప్రపంచానికి దూరమయ్యేవారని,ఆడబిడ్డ కాన్పుకోసం వచ్చి వాగువద్దే ప్రసవిస్తే బిడ్డ పేగును బండరాళ్లతో తెంచిన సంఘటనలు ఉన్నాయని,అలాంటి దుస్థితికి కాంగ్రెస్‌పాలకులే కారణమన్నారు.ఆడబిడ్డలకు కాన్పు కష్టాలు ఉండవద్దని ఆలోచన చేసి మహదేవ్‌పూర్ మండలంలోని రింగ్ రోడ్‌లో ఉన్న వాగుపై బ్రిడ్జిలు నిర్మించామని చెప్పారు.చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అటవీశాఖ అనుమతులు వచ్చాయని,పోతారం లిఫ్ట్ నిర్మాణానికి ఫైనాన్స్ సమస్యను తీర్చాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.అదే విధంగా మంథని మండలం ఆరెంద గ్రామసమీపంలోని మానేరుపై బ్రిడ్జి నిర్మాణం,గిరిజనులు ఎక్కువగా ఉన్నఈప్రాంతంలో మాడా కార్యాలయం ఏర్పాటు,మంథని మండలం గుంజపడుగు,మహాముత్తారం మండలం బోర్లగూడెం గ్రామాలను మండలాలుగా ప్రకటించాలని,పెద్దపల్లి నుంచి కాటారం వరకు నాలుగు లైన్‌ల రోడ్డు నిర్మాణం,కాళేశ్వరం,మేడిగడ్డ,అన్నారం బ్యారేజీ ప్రాంతాలను టూరీజం కేంద్రాలుగా తీర్చిదిద్దాలని,ఆలయాలను సుందరీకరించేలా చర్యలు తీసుకోవాలని,ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో పాటు మానేరు నది ఉప్పొంగితే పరివాహక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వరదలు వచ్చి రైతులు నష్టపోకుండా కరకట్టల నిర్మాణాలను చేపట్టేలా తగు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను ఆయన విన్నవించారు.తొమ్మిదేండ్ల కాలంలో తాను మంథని ప్రాంత ప్రజలకు అనేక సేవలు అందించానని,ఆకలి తీర్చేతనపై కాంగ్రెస్ నాయకులు అబద్దాలు,దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆయన వాపోయారు.ఎన్నికలు రాంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి,ఆయన సోదరుడు నోట్ల సంచులతో తిరుగుతూ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులను కొనుగోలు చేస్తున్నారని ఆయన తెలిపారు.తనకు అవకాశం కల్పిస్తే ఎంతో మంది పేదోళ్ల ఆకలి తీర్చానని,పేద బిడ్డలకు చదువులు చెప్పించానని,మీ కళ్ల ముందే తాను చేసిన అభివృద్ది కన్పిస్తుందని మరోసారి ఆశీర్వదించాలని కోరారు,రాష్ట్రంలో రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని,కాబోయేది ముఖ్యమంత్రి కేసీఆర్ అని,వారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి మీ రుణం తీర్చుకుంటానని అన్నారు.బీసీ బిడ్డగా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించారని,ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.ఈ ఆశీర్వాద సభల అన్ని కేటగిరీల నాయకులు ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు..

Post A Comment: