మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి
తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోషియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మోత్కూరి యాదయ్య పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఇద్దులాపూర్ గ్రామం దార మొండయ్య(మధు)ను రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జీ తో పాటు రాష్ట్ర నిజ నిర్ధారణ కమిటీ కన్వీనర్ గా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు మోత్కూరు యాదయ్య మాట్లాడుతూ దార మధు టి జి పి ఏ 2016లో ఏర్పడినప్పటి నుండి జిల్లా,రాష్ట్ర పదవులలో సమర్థవంతంగా పనిచేసిన అనుభవం ఉందని,తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా నాయకులతో సత్స సంబంధాలు ఉన్నాయని ఏ బాధ్యతలు అప్పగించిన సమర్థవంతంగా అంకిత భావంతో మరింతగా పని చేస్తాడని దార మదును అభినందిస్తూ బాధ్యతలు అప్పగించిన్నట్లు తెలిపారు.అనంతరం మధు మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో రాష్ట్ర నిజ నిర్ధారణ కమిటి కన్వీనర్ గా ఉత్తర్వులు జారీ చేసిన టి జి పి ఏ వ్యవస్థాపక అధ్యక్షులు మోత్కూరు యాదయ్య ,దీనికి గాను సహాకరించిన రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్ (ప్రభు), ప్రధాన కార్యదర్శికి పవన్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలుపారు.గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.

Post A Comment: