జుక్కల్ మండల్ ప్రతినిధి / క్రిందిదొడ్డి నాగరాజ్
జుక్కల్ న్యూస్;
గత వారం నుండి సరైన సమయానికి కరెంటు లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు స్థానిక విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు దాంతో రైతులు అగ్రహంతో మంగళవారం ఉదయాన్నే 9 గంటలకు ధర్నాకు దిగారు. ఈ నిరసనలో బస్వాపూర్ గ్రామ రైతులు మరియు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జుక్కల్ కు వెళ్లే మార్గంలో వాహనాలు అధిక సంఖ్యలో నిలిచిపోయాయి. ఇది తెలుసుకున్న స్థానిక పోలీస్ సిబ్బంది మరియు ఇతర నాయకులు వచ్చి నచ్చ చెప్పారు. అయితే కెసిఆర్ వచ్చినప్పుడు దానికి రెండు రోజుల ముందు 24 గంటల కరెంటు ఇచ్చారు. మిగతా రోజులు ఎక్కడ కూడా 24 గంటల కరెంటు లేదని రైతులు స్థానిక విద్యుత్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వకుండా మేము ఇస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని రైతులు విమర్శించారు. కొద్దిసేపటి తర్వాత స్థానిక విద్యుత్ అధికారి మాట్లాడి ఈరోజు నుండి 24 గంటలు కరెంటు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో బస్వాపూర్ గ్రామ రైతులు, యువకులు పాల్గొన్నారు.


Post A Comment: