మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి
అమరవీరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను ఉదృతం చేస్తాం..
"కొల్లూరి మల్లేష్" సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ అంతర్గాం మండల కార్యదర్శి*
(సి పి ఐ ఎమ్ ఎల్) న్యూడెమక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నవంబర్ 1 నుండి 9 వరకు జరిగే అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో అంతర్గాం మండల కేంద్రము పార్టీ కార్యాలయం లో అమరవీరుల సంస్మరణ సభ సందర్భంగా కె మల్లేష్ మాట్లాడుతూ..భూమి, భుక్తి, ఈ దేశ విముక్తి కోసం కమ్యూనిస్టు విప్లవ కారులు ఎన్నో త్యాగాలు చేశారని పాలక ప్రభత్వాలకు వ్యతిరేకంగా భూస్వాములకు ఎదురొడ్డి నిలిచారని దొరలపై తిరగబడి వేలాది ఎకరాల భూములు ప్రజలకు పంచిపెట్టారని అన్నారు.భారత విప్లవ ఉద్యమంలో చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ సింగ్, కాను సైన్యాల్, తరిమేల నాగిరెడ్డి, పొట్ల రామనరసయ్య, నీలం రామచంద్రయ్య, జంపాల ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, పైలా వాసుదేవరావు, దొరన్న, ఎల్లన్న, రాయల సుభాష్ చంద్రబోస్, పూనం లింగన్న అరుణోదయ రామారావులతో పాటు ఎంతోమంది అమరవీరులు తమ అమూల్యమైన ప్రాణాలను పేద ప్రజల కోసం అర్పించారని ఆయన అన్నారు. ఈ జిల్లాలో అనేక మంది కామ్రేడ్స్ అమరులయ్యారని వారిలో కుమారస్వామి, యు రాములు, మొండయ్య, కత్తెరమల్ల పోచన్న, మేకల రాజన్న, ఆరుముళ్ళ భూమన్న, బుష్పాక రాజన్న, కోల నరసయ్య తదితరులు ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేశారని ఈ పోరాటక్రమంలో అమరులయ్యారన్నారు, ఈ అమరవీరుల ఆశయ సాధన కోసం మనమంతా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు మేరుగు చంద్రయ్య, వేల్పుల సాంబయ్య, చామల తిరుపతి, హమాలీ సంఘం నాయకులు దేవి శంకర్, తీగుట్ల పోచం తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: