మేడిగడ్డ టీవీ న్యూస్ ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:రామగుండం,నవంబర్15:మేడిగడ్డటీవీన్యూస్,ఛానల్,మద్యంషాపును తనిఖీ చేసిన కలెక్టర్,షాపుకు కేటాయించిన మద్యం స్టాక్,ప్రతి రోజు చేసిన మద్యం విక్రయం వివరాలను పకడ్బందీగా రిజిస్టర్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.బుధవారం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ రామగుండంలోని ఎఫ్ సీఐ.క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న ఎస్విఎస్.వైన్స్ షాప్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడరు.మద్యం స్టాక్ వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలని,బెల్ట్ షాపులకు,వివిధ రాజకీయ పక్షాలకు బ్లాకుగా మద్యం సరఫరా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదని,అక్రమంగా మద్యం సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.మద్యం స్టాకును నిర్దేశించిన గోడౌన్ లలో మినహాయించి,మిగిలిన చోట డంప్ చేయరాదని,నిబంధనలను తప్పకుండా పాటించాలని,లేనియెడల కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ తనిఖీలో ఎక్సైజ్ శాఖ సిఐ సుంక రమేష్,సిబ్బంది,సంబంధిత.అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: