ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ తూర్పు నియోజకవర్గ యువత అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన నడుం బిగించి నడుద్దామని కంకణబద్ధులై ఉన్నారని ఎమ్మెల్యే, బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ యూత్ నాయకులు కలకొండ అభినాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన నూతన ఓటర్లు కారు కేసీఆర్ నాయకత్వాన నరేందర్ కు జై కొట్టి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.సుమారు వందమంది నేడు నన్నపునేని నరేందర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కొరివి పరమేశ్వర్ ముఖ్య నాయకులు, యూత్ నాయకులు హాజరయ్యారు.

Post A Comment: