మేడిగడ్డ టీవీ న్యూస్ ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:రామగుండం,నవంబర్15:మెడిగడ్డటీవీ న్యూస్,ఛానల్,ఉన్నత లక్ష్యాలను.నిర్దేశించుకోవాలి,బాలల దినోత్సవం వేడుకల్లో,కలెక్టర్,జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన దిశగా కృషి చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.బుధవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ రామగుండంలోని తబిత సంరక్షణ కేంద్రంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలలో పాల్గోన్నారు.తబిత సంరక్షణ కేంద్రంలో ఉన్న పిల్లలతో కలిసి కేక్ కట్ చేసిన కలెక్టర్ వారితో కాసేపు సరదాగా మాట్లాడి,పిల్లలను వారి ఆశయాలను,దినచర్య వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడరు,మనకు జీవితంలో అనేక కష్టాలు,బాధలు వస్తాయని,వాటిని అధిగమించి ధైర్యంగా నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన కోసం కృషి చేయాలని కలెక్టర్ పిల్లలకు సూచించారు.ప్రతిరోజు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని,వ్యాయామం చేయాలని,కొంత సమయం క్రీడలకు కేటాయించాలని,ఉల్లాస వాతావరణంలో చదువుకోవాలని,చదువుపై శ్రద్ధ వహించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్,సిడిపిఓ స్వరూపరాణి,సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: