పెద్దపల్లి:హైదరాబాద్: నవంబర్:16:(మేడిగడ్డటీవీన్యూస్):నోటుకి ఓటు అమ్ముకుంటే ఐదేళ్ల భవిష్యత్తు అధోగతే!జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ కమిటీ సమావేశంలోవిజయవిహారం రమణమూర్తి సందేశం,తెలంగాణ ఓటర్స్ లో చైతన్యం రావాలి..ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి-ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి'అనే నినాదంతో జైభారత్ సమస్త ఫౌండర్ సీనియర్ జర్నలిస్టు విజయవిహారం రమణమూర్తి పిలుపునిచ్చారు,జైభారత్ జస్ట్ ఓట్ తెలంగాణా క్యాంపెయిన్ కమిటీ-2023-24 సమావేశం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ బుధవారం నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.బీసీల కుర్చీపై అగ్రకులాల కబ్జా ఎన్నాళ్లు?.మహిళలకు దక్కని అధికారం!. బీసీలకి-50%,మహిళలకి 50%,టిక్కెట్లు ఇవ్వాలి!! ఇది ప్రజల డిమాండ్?!. ప్రజాసామిక డిమాండ్!!!1,00,000-లక్ష సెల్ఫీలు,జై భారత్ సామాజిక విప్లవ రణభేరి జ్వాల,జై భారత్ ఎస్సీ పోరాట వేదిక,జై భారత్ బీసీ పోరాట వేదిక,జై భారత్ ఏస్టీ పోరాట వేదిక,ప్రజలు చైతన్యపరిచే విధంగా,గత(4)నాలుగు నెలల నుండి లక్ష సెల్ఫీల ప్రోగ్రాం నిర్వహించి ఓటును అమ్ముకోవద్దు,భారత ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం!!.అనే నినాదంతో గత 20 సంవత్సరాల నుండి ప్రజలను చైతన్య పరుస్తూ మరో స్వతంత్ర పోరాటంలో ముందుకు సాగుతూ ఎందరో మహనీయుల త్యాగాల చరిత్రలను భావ్యప్రపంచానికి చూపిస్తూ..అలుపెరుగని పోరాటమే!.జై భారత్ సమస్తా..ఎందరో మేధావుల మన్ననలు పొందుతున్న జైభారత్ సమస్త రమణమూర్తి... జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ ప్రోగ్రామును ఉద్దేశించి ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడారు,భారత ప్రజాస్వామ్య పరిరక్షణ పట్ల ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని,నోటికి ఐదేళ్ల భవిష్యత్తును అమ్మిన మనిషి శవంతో సమానం-నాయకులు పోస్తున్న మద్యానికి పడేస్తున్న నోటుకీ ఓటుని,సిగ్గులేదా అని ఓటర్లను పదునుగా ప్రశ్నిస్తూ లక్షలాది పోస్టర్ల ద్వారా ఎన్నికలు జరిగిన ప్రతిచోట ఓటర్లను జైభారత్ జాగృతం చేస్తూ వస్తుందని-మకిలిగా మారుతున్న మన ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రక్షాళితం చేయడానికి,గాంధీజీ లాంటి మహనీయులు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని..ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి!..జస్ట్ ఓటు క్యాంపెయిన్ ద్వారా జైభారతి ఓ చారిత్రాత్మక పాత్ర పోషిస్తుందని అన్నారు,ఈ ప్రజాచైతన్య సమావేశం కార్యక్రమంలో జైభారత్ జాతీయ కార్యదర్శి జ్వాలా,ప్రధాన కార్యదర్శి రజిని,కార్యదర్శి లోకనాథ్,గోల సత్యనారాయణ,వెంకన్న,వెంకట.మల్లయ్య,శైలజ,పద్మవేణి స్వాతి,నరసయ్య సుభాని,షేర్ ముంతాజ్ ఇమామ్, కోటయ్య,అశోక్ చక్రవర్తి, సుధాకర్,వీరయ్య, యాదగిరి,నరేందర్,ఆరుగురు ఉపాధ్యక్షులు,ఏడుగురు కార్యదర్శులు,37 మంది సభ్యుల కమిటీ లు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు...
Home
Unlabelled
భావితరాల భవిష్యతు!. భారత ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి..ఓటర్స్ కు జైభారత్ పిలుపు...
Post A Comment: