ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;వరంగల్ తూర్పు నియోజకవర్గం లో ఎమ్మెల్యే,బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నరేందర్ కు రోజు రోజుకు పెద్ద ఎత్తున మద్దతు పెరుగుతుంది.
డివిజన్ల లో ప్రజలు ఎక్కడికక్కడ నరేందర్ గెలుపును కాంక్షిస్తూ ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేసుకొని తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇప్పటికి నియోజకవర్గాన కుల సంఘాలు,పరపతి సంఘాలు అన్ని కమ్యూనిటీల ప్రజలు మూకుమ్మడిగా ఎమ్మెల్యే నరేందర్ కు మద్దతు తెలిపుతు ఏకగ్రీవ తీర్మానం చేస్తున్న విషయం విదితమే అందులో భాగంగా ఎన్నికల బరిలో నరేందర్ కు మరింత బలం చేకూరుస్తూ వరంగల్ ప్రింటర్స్ అసోసియేషన్, మార్కండేయ సేవ సంఘం వారు నేడు మూకుమ్మడి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఏకగ్రీవ తీర్మానం చేసి ఎమ్మెల్యే, బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ కు ఆమోద పత్రాన్ని అందజేసారు.
ఈ సందర్భంగా వరంగల్ సిటీ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గిర్మాజీపేటలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే,బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే,బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ప్రింటర్స్ అసోసియేషన్ వారికి 100 గజాల స్థలం కేటాయించి భవనానికి నిధులు కేటాయిస్తా. ప్రింటర్స్ అసోసియేషన్, మార్కండేయ సేవ సంఘం వారు పూర్తి
మద్ధతు ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా వారికి ధన్యవాదాలు.
ఈ నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నాం.
-నియోజకవర్గాన కలెక్టరేట్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్,గురుకుల పాటశాలలు,నూతన బస్ స్టేషన్,రింగ్ రోడ్ ఇలా గొప్పగా అభివృద్ధి చేశా
-ప్రతి గల్లినా రోడ్లు పూర్తి చేసిన ఘనత నాది.
-కాంగ్రెస్ వాళ్లు అజంజాహి మిల్స్ అమ్ముకుంటే కేసీఆర్ పెద్ద మనసుతో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసిర్రు 10వేల మందికి మన నియోజకవర్గాన ఉపాది దొరుకుతుంది.
-వరంగల్ ను టూరిరిజంగా దేవేలెప్మెంట్ చేస్తున్నాం
-కష్టాల నుండి వచ్చిన వ్యక్తిగా పేదల అభ్యున్నతికి ఏళ్ల వేళలా పాటుపడతా
-ప్రగతి చక్రాలు అగొద్దు అంటే కేసీఆర్ హ్యట్రిక్ సాధించాలి.
-కాంగ్రెస్ నమ్మితే మళ్ళీ తెలంగాణ చీకట్లు అలుముకుంటాయి.
-ఎన్నికల అనంతరం సౌభాగ్యాలక్ష్మి ద్వారా ప్రతి మహిళకు 3వేల భృతి అందిస్తాం
-గ్యాస్ సిలిండర్ 400వందలకే
-ప్రతి ఇంటికి సన్నబియ్యం
-ప్రతి ఒక్కరికి బీమా...ఆరోగ్య శ్రీ ద్వారా 15లక్షల వరకు వైద్యం చేసుకునే వెసులుబాటు.
ఇలా గొప్పగా కేసీఆర్ ఆసరాగా ఉంటున్నారు.
ఎన్నికల్లో కేసీఆర్ కారు గుర్తుకు ఓటు వేసి నన్నయ గెలిపించండి మీ హామీలన్నీ నెరవేర్చే బాధ్యత నాది.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాలిన సురేష్,ఎన్నికల ఇంచార్జ్ కుచన రమేష్, దేవాలయ చేర్మెన్ ఎలకంటి సతీశ్,కుచన క్రాంతి,ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంగల బానుమూర్తి, మార్కండేయ సేవ సంఘ అధ్యక్షులు ఆదినారాయణ,వెంగరి ప్రదీప్,కుచన శ్రీకాంత్,కొడెం యుగేందర్,మాచబత్తుల రాజు కుమార్,పాషికంటి రవీందర్,కృష్ణ,సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: