పెద్దపల్లి:పాలకుర్తి:నవంబర్:16:(మేడిగడ్డటీవీన్యూస్):తాటికల్లు బహుబాగుందేనని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ కితాబిచ్చారు.మంథని నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పుట్ట మధుకర్,పాలకుర్తి మండలం కన్నాల గ్రామంలో గౌడ కులస్తుల విజ్ఞప్తి మేరకు కాసేపు సేద తీరి తాటి కల్లు సేవించారు.రాష్ట్రంలోని గౌడ కులవృత్తిని కాపాడుకునే విధంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని,తాటి ఈత కల్లు సేవించడం ఆరోగ్యానికి ఎంతో మంచిదనే సందేశం ఇస్తూ నీరా హబ్‌లను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.గీతా కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకమైన విధివిధానాల రూపొందించిన.బీఆర్‌ఎస్ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే కులవృత్తులకు ప్రోత్సహం లబిస్తోందని అన్నారు.ఎన్నికల ప్రచారంలో బాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ తాటికల్లు సేవించడం పట్ల గీతాకార్మికులు,గౌడ కులస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో కమాన్పూర్ మండల్ నాయకులు,పాలకుర్తి మండల నాయకులు,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు...
Post A Comment: